బాలికపై నలుగురు కుర్రాళ్లు అత్యాచారం.. ఆపై ప్రధానోపాధ్యాయుడు కూడా..

Bihar student rapes teen, flees, then headmaster rapes her. బీహార్‌లోని కైమూర్ జిల్లాలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికను నలుగురు విద్యార్థులు కిడ్నాప్ చేశారు.

By అంజి  Published on  29 Nov 2022 10:55 AM GMT
బాలికపై నలుగురు కుర్రాళ్లు అత్యాచారం.. ఆపై ప్రధానోపాధ్యాయుడు కూడా..

బీహార్‌లోని కైమూర్ జిల్లాలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలికను నలుగురు విద్యార్థులు కిడ్నాప్ చేశారు. ఆ తర్వాత విద్యార్థుల్లో ఒకరు బాలికపై అత్యాచారం చేశారు. అదే సమయంలో వారి వెనకే వెళ్లిన ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వారు చేస్తున్న అఘాయిత్యాన్ని గుర్తించాడు. ఇది గమనించి విద్యార్థులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. కానీ బాలికకు సహాయం చేయడానికి బదులుగా, ప్రధానోపాధ్యాయుడు కూడా ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ ఘటన శనివారం నాడు జరిగింది. బాలిక మల విసర్జనకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నలుగురు అబ్బాయిలు ఆమెను అపహరించారు. వారు ఆమెను కొద్ది దూరం ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లారు. ఆ తర్వాత వారిలో ఒక అబ్బాయి ఆమెపై అత్యాచారం చేయగా, మిగిలిన వారు పక్కనే ఉండి వారిని చూశారు. సురేంద్ర కుమార్ భాస్కర్ అనే పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నలుగురు అబ్బాయిలు బాలికను బలవంతంగా తీసుకెళ్లడాన్ని గమనించి, వారిని దూరం నుండి అనుసరించాడు. అతన్ని చూడగానే అబ్బాయిలు పారిపోయారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తనను కాపాడతాడని భావించినట్లు బాలిక పోలీసులకు తెలిపింది. బదులుగా, అతను ఆమెపై అత్యాచారం చేసి, రక్తస్రావంతో పొదల్లో వదిలేశాడు.

ప్రధానోపాధ్యాయుడు, బాలుడిపై లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాలికను చికిత్స, వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 ప్రకారం బాలిక వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ముందు నమోదు చేస్తారు. బాలుడు పరారీలో ఉండగా ప్రధానోపాధ్యాయుడిని అరెస్టు చేశారు. బాలుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. మిగిలిన ముగ్గురు అబ్బాయిల పేర్లు తెరపైకి వస్తే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని, వారిపై కూడా చర్యలు తీసుకుంటామని భభువా డీఎస్పీ సునీల్ కుమార్ తెలిపారు.

Next Story