ఆస్పత్రిలో దారుణం.. ఓ పక్క భార్య ప్రసవవేదన.. మరోపక్క భర్త నికృత చేష్టలు

Bihar man accompanying pregnant wife for delivery molests female guard outside hospital. బీహార్‌ రాష్ట్రంలో ఓ ఆస్పత్రిలో మహిళా గార్డుపై వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హాజీపూర్‌లో

By అంజి  Published on  15 Nov 2022 9:51 AM IST
ఆస్పత్రిలో దారుణం.. ఓ పక్క భార్య ప్రసవవేదన.. మరోపక్క భర్త నికృత చేష్టలు

బీహార్‌ రాష్ట్రంలో ఓ ఆస్పత్రిలో మహిళా గార్డుపై వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన హాజీపూర్‌లో జరిగింది. ఆసుపత్రి వెలుపల మహిళా గార్డుపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు ప్రతీక్‌ గర్భవతి అయిన తన భార్యతో కలిసి ప్రసవం కోసం హాజీపూర్‌లోని సదర్ ఆసుపత్రికి వచ్చాడు. ఆస్పత్రిలో ఓ వార్డులో భార్యను చేర్చగా, భర్త ప్రతీక్‌ ఆసుపత్రి బయట తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే ప్రతీక్‌.. అక్కడే ఉన్న మహిళా గార్డుతో అసభ్యంగా ప్రవర్తించాడు.

తనతో ప్రతీక్‌ సరసాలాడేందుకు ప్రయత్నిస్తున్నాడని మహిళా గార్డు తెలిపింది. తాను స్వీట్‌ షాప్‌ యజమానినని, మిఠాయిలు తినమని బలవంతం చేస్తున్నాడని ఆసుపత్రి వెలుపల సెక్యూరిటీలో ఉంచిన మహిళ తెలిపింది. మహిళ ప్రతిఘటించి కేకలు వేసింది. సమస్యను పసిగట్టిన నిందితుడు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా ఆస్పత్రి సిబ్బంది పట్టుకున్నారు. ఆసుపత్రి సివిల్ సర్జన్ సంఘటనా స్థలానికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.నిందితుడిని అరెస్టు చేయగా, తదుపరి విచారణ కొనసాగుతోంది.

Next Story