పైళ్లైన నాలుగో రోజు.. భ‌ర్త ముందే మాజీ ప్రియుడు ఏం చేశాడంటే..?

Bihar jilted lover commits suicideప్రేమ‌లో ఉన్న‌ప్పుడు అంతా బాగానే ఉంటుంది. అయితే.. వారి బంధం ముక్క‌లైన‌ప్పుడే

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2021 2:28 AM GMT
పైళ్లైన నాలుగో రోజు.. భ‌ర్త ముందే మాజీ ప్రియుడు ఏం చేశాడంటే..?

ప్రేమ‌లో ఉన్న‌ప్పుడు అంతా బాగానే ఉంటుంది. అయితే.. వారి బంధం ముక్క‌లైన‌ప్పుడే అస‌లు స‌మ‌స్య మొద‌లవుతుంది. ప్రేమికుడిని కాద‌ని ప్రేయ‌సి మ‌రో యువ‌కుడిని పెళ్లి చేసుకోవ‌డంతో ఆగ్ర‌హించిన ప్రియుడు.. ప్రేయ‌సిని దారుణంగా హ‌త్య చేశాడు. అనంత‌రం త‌న‌ను తాను కాల్చుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ ఘ‌ట‌న బిహార్ రాష్ట్రం నలంద జిల్లాలోని భగాన్‌ బిఘా పోలీసు స్టేషన్ పరిధిలో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళితే.. కైవైది ప్రాంతంలో సందీప్ కుమార్ త‌న కుటుంబంతో క‌లిసి నివ‌సిస్తున్నాడు. అత‌డి కుమారై ష‌బ్నం కుమారికి షాపూర్‌కు చెందిన వికాస్ కుమార్‌తో మే 26 న పెళ్లి జ‌రిపించారు.

పెళ్లైన అనంత‌రం నాలుగ‌వ రోజు ష‌బ్నం ఆమె భ‌ర్త‌తో క‌లిసి ద్విచ‌క్ర వాహ‌నంపై పుట్టింటికి బ‌య‌లుదేరింది. మార్గ‌మ‌ధ్యంలో రాజ్‌పాల్ పాశ్వాన్ అలియాస్ రేహాన్ వారిని అడ్డుకున్నాడు. ష‌బ్నంను త‌న‌తో రావాల్సిందిగా అత‌డు బ‌ల‌వంతం పెట్టాడు. ఇందుకు ష‌బ్నం అంగీక‌రించ‌క‌పోవ‌డంతో పాశ్వాన్ ఆగ్ర‌హానికి గురైయ్యాడు. కోపంతో తాను తెచ్చిన గ‌న్‌తో పాయింట్ బ్లాంక్ రేంజ్‌లో కాల్పులు జ‌రిపాడు. అనంత‌రం త‌న‌ను తాను కాల్చుకున్నాడు. ఇద్ద‌రిని జిల్లా స‌ద‌ర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప‌రీక్షించిన వైద్యులు ష‌బ్నం చ‌నిపోయిన‌ట్లు తెలిపారు. పాశ్వాన్ ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌డంతో పాట్నాకు త‌ర‌లిస్తుండ‌గా.. మార్గ‌మ‌ధ్యంలో మృతి చెందాడు. దీనిపై స‌మాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it