సినీ నటిపై స్నేహితుడు అత్యాచారం.. ఇంటర్వ్యూ పేరుతో పిలిచి..
గురుగ్రామ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 24 ఏళ్ల భోజ్‌పురి నటిపై.. ఆమె స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు.
By అంజి Published on 21 July 2023 10:56 AM ISTసినీ నటిపై స్నేహితుడు అత్యాచారం.. ఇంటర్వ్యూ పేరుతో పిలిచి..
గురుగ్రామ్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. 24 ఏళ్ల భోజ్‌పురి నటిపై.. ఆమె స్నేహితుడే అత్యాచారానికి పాల్పడ్డాడు. నటికి అతడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయ్యాడు. ఆ తర్వాత ఇద్దరూ స్నేహితులుగా మారారు. ఈ క్రమంలోనే నిందితుడు ఆమెను ఇంటర్వ్యూ సాకుతో ఓ హెటల్‌కు రప్పించి అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు గురువారం తెలిపారు. తాను భోజ్‌పురి నటినని, ప్రస్తుతం ఢిల్లీలో నివసిస్తున్నానని ఆ మహిళ తన ఫిర్యాదులో పేర్కొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలికి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాలో ఆమె తన వీడియోలను క్రమం తప్పకుండా పోస్ట్ చేసేది.
"ఇన్‌స్టాగ్రామ్ ద్వారా మహేష్ పాండే అనే వ్యక్తితో నాకు పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల క్రితం నాకు భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో పని ఇప్పిస్తానని అతను చెప్పాడు. జూన్ 29న అతను ఇంటర్వ్యూ సాకుతో గురుగ్రామ్‌లోని ఉద్యోగ్ విహార్ ప్రాంతంలోని హోటల్‌కు నన్ను పిలిచాడు" అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. "నేను హోటల్‌కు చేరుకున్నప్పుడు, మహేష్ నన్ను తీసుకెళ్లిన గదిని అప్పటికే బుక్ చేసాడు. కొన్ని ప్రశ్నలు అడిగిన తర్వాత అతను మద్యం తాగడం ప్రారంభించాడు. ఆ తర్వాత నేను వెళ్లడానికి ప్రయత్నించగా.. అతను నాపై బలవంతంగా అత్యాచారం చేసాడు" అని నటి ఆరోపించింది.
నిందితుడు తనను చంపేస్తానని బెదిరించాడని, ఆ తర్వాత అతని స్నేహితులు కొందరు తనకు ఫోన్ చేసి, తన ప్రైవేట్ వీడియోలను ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించారని ఆమె చెప్పింది. మహిళ ఫిర్యాదు మేరకు, బుధవారం ఉద్యోగ్ విహార్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్లు 376 (రేప్), 506 (నేరపూరిత బెదిరింపు), 34 (సాధారణ ఉద్దేశ్యం) కింద గురుగ్రామ్‌లోని చకర్‌పూర్ ప్రాంతంలో నివసించే మహేష్ పాండేపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయబడింది. ఆరోపణలను ధృవీకరిస్తున్నామని, నిందితులను త్వరలోనే అరెస్టు చేస్తామని క్రైం ఏసీపీ వరుణ్ దహియా తెలిపారు.