కారు బానెట్‌పై యువకుడిని ఈడ్చుకెళ్లిన మ‌హిళ‌

Bengaluru Woman Drives With Man Lying On Car's Bonnet. ఒక వ్యక్తితో గొడవ పడిన మహిళ ఆగ్రహంతో అతడ్ని కారు బానెట్‌పై ప్రమాదకరంగా కిలోమీటరు దూరం

By M.S.R  Published on  20 Jan 2023 7:35 PM IST
కారు బానెట్‌పై యువకుడిని ఈడ్చుకెళ్లిన మ‌హిళ‌

ఒక వ్యక్తితో గొడవ పడిన మహిళ ఆగ్రహంతో అతడ్ని కారు బానెట్‌పై ప్రమాదకరంగా కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. బెంగుళూరులో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ బానెట్‌ న ఓ వ్యక్తిని ఉంచి ఎస్‌యూవీని నడిపింది. నగరంలోని జ్ఞాన భారతి నగర్‌లో ప్రియాంక అనే మహిళ కిలోమీటరు దూరం వెళ్లగా, ఆ వ్యక్తి బోనెట్‌ను పట్టుకుని వేళాడుతూ కనిపించాడని పోలీసులు తెలిపారు. దర్శన్ అనే వ్యక్తికి ప్రియాంకకు వాగ్వాదం జరిగిందని అన్నారు.

ప్రియాంక నడుపుతున్న టాటా నిక్సన్ కారు, దర్శన్ డ్రైవ్‌ చేస్తున్న స్విఫ్ట్ కారు శుక్రవారం ఢీకొన్నాయి. జ్ఞాన భారతి నగర్‌ ప్రాంతంలోని ఉల్లాల్ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఈ సందర్భంగా ప్రియాంక, దర్శన్‌ మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కారు నుంచి దిగిన దర్శన్‌, ప్రియాంక కారు వద్దకు వచ్చాడు. డ్రైవింగ్‌ సీటులో ఉన్న ప్రియాంక కారు నుంచి కిందకు దిగలేదు. దర్శన్‌ను కారుతో ఢీకొట్టి వేగంగా డ్రైవ్‌ చేసింది. అతడు ప్రియాంక కారు బానెట్‌పై ప్రమాదకరంగా వేలాడాడు. కారును ఆపకుండా కిలోమీటరు దూరం వరకు బానెట్‌పై ఆమెను ఈడ్చుకెళ్లింది. రద్దీ రహదారిపై ఈ ఘటన జరగగా.. కొందరు వ్యక్తులు బైక్‌ల్లో ఆ కారును అనుసరించి చివరకు దానిని అడ్డుకున్నారు. దర్శన్‌ ఫిర్యాదుతో ప్రియాంకపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఫిర్యాదుతో దర్శన్‌తోపాటు మరో ముగ్గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

Next Story