బెంగళూరులో టెకీ జంట‌ ఆత్మ‌హ‌త్య

బెంగళూరులోని కోతనూరు ప్రాంతంలో తాళం వేసిన గదిలో తన భాగస్వామి మృతదేహం క‌నిపించ‌డంతో ఒక టెక్ ఉద్యోగిని భవనంలోని 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

By -  Medi Samrat
Published on : 31 March 2026 2:47 PM IST

బెంగళూరులో టెకీ జంట‌ ఆత్మ‌హ‌త్య

బెంగళూరులోని కోతనూరు ప్రాంతంలో తాళం వేసిన గదిలో తన భాగస్వామి మృతదేహం క‌నిపించ‌డంతో ఒక టెక్ ఉద్యోగిని భవనంలోని 17వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

సిద్దిపేటకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ భాను చంద్రారెడ్డి కుంట (32), సోమవారం తన ఫ్లాట్‌లోని తాళం వేసిన గదిలో ఉరి వేసుకుని కనిపించాడు. పోలీసుల కథనం ప్రకారం, పదేపదే తలుపు తట్టినా భాను స్పందించకపోవడంతో అతని భాగస్వామి షాజియా (31)కు అనుమానం వచ్చింది. షాజియా IBMలో పనిచేస్తుంది.

భయపడి అపార్ట్‌మెంట్ సెక్యూరిటీకి, ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించింది. చివరికి తలుపును బలవంతంగా తెరిచి చూడగా, గదిలో భాను శవమై కనిపించాడు. కొన్ని నిమిషాల తర్వాత.. షాజియా బయటకు పరుగెత్తి అదే నివాస భవనంలోని 17వ అంతస్తు నుండి దూకేసింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది.

మృతుల కుటుంబాలు ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తెలంగాణ పోలీసులు రెండు వేర్వేరు అసహజ మరణ కేసులను నమోదు చేశారు. ఆరోగ్య సమస్యలు, సంబంధాలలోని ఇబ్బందులు, మానసిక ఒత్తిడి వంటి పలు కోణాల్లో దర్యాప్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక, తదుపరి దర్యాప్తు తర్వాతే కచ్చితమైన కారణం స్పష్టమవుతుందని వారు చెప్పారు.

Next Story