మహిళ దుస్తులపై నెటిజన్ అభ్యంతరం.. యాసిడ్ దాడి చేస్తానని బెదిరింపు.. చివరికి..
బెంగుళూరులో ఒక వ్యక్తి సోషల్ మీడియా పోస్ట్‌లో ఒక మహిళ దుస్తుల ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆమెపై యాసిడ్ పోస్తానని బెదిరించడంతో ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు.
By అంజి Published on 11 Oct 2024 6:30 AM GMTమహిళ దుస్తులపై నెటిజన్ అభ్యంతరం.. యాసిడ్ దాడి చేస్తానని బెదిరింపు.. చివరికి..
బెంగుళూరులో ఒక వ్యక్తి సోషల్ మీడియా పోస్ట్‌లో ఒక మహిళ దుస్తుల ఎంపికపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆమెపై యాసిడ్ పోస్తానని బెదిరించడంతో ఉద్యోగం నుండి తొలగించబడ్డాడు. మహిళ భర్త ఫిర్యాదు చేయడంతో పాటు ఇన్‌స్టాగ్రామ్‌లో తన భార్యకు పంపిన బెదిరింపు సందేశాల స్క్రీన్‌షాట్‌లను షేర్ చేయడంతో నికిత్ శెట్టి అనే వ్యక్తిని ఉద్యోగం నుంచి తొలగించారు.
"ఇది చాలా తీవ్రమైనది. బట్టల ఎంపిక కోసం నా భార్య ముఖంపై యాసిడ్ పోస్తానని ఈ వ్యక్తి బెదిరిస్తున్నాడు. ఎలాంటి సంఘటన జరగకుండా ఈ వ్యక్తిపై వెంటనే చర్య తీసుకోండి" అని జర్నలిస్ట్ షాబాజ్ అన్సార్.. కర్ణాటక డీజీపీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు.
"నా భార్యపై యాసిడ్ దాడి చేస్తానని బెదిరిస్తున్న వ్యక్తి ఎటియోస్ డిజిటల్ సర్వీస్‌లో పనిచేస్తున్నాడు. ఈ సంస్థలో మహిళలు సురక్షితంగా ఉన్నారని నేను అనుకోను" అని షాబాజ్ అన్సార్ చెప్పారు.
తరువాత జర్నలిస్ట్ తదుపరి ట్వీట్‌లో.. నికిత్ శెట్టిని కంపెనీ తొలగించిందని రాశారు. "నా భార్య ఖ్యాతిశ్రీ_ని యాసిడ్ దాడి చేస్తానని బెదిరించిన వ్యక్తి ఉద్యోగం కోల్పోయాడు. కంపెనీ సత్వరమే స్పందించి అతనిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విధంగా చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు" అని ఆయన అన్నారు.
ఈ సంఘటనపై ప్రతిస్పందనగా, ఎటియోస్ సర్వీసెస్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటనను విడుదల చేసింది. నికిత్ రెడ్డి యొక్క "ఆమోదించలేని" ప్రవర్తనపై "తీవ్ర విచారం" అని పేర్కొంది. సురక్షితమైన వర్క్‌ప్లేస్‌ను సమర్థించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని కంపెనీ తెలిపింది.
"మరొక వ్యక్తి దుస్తుల ఎంపికకు సంబంధించి బెదిరింపు ప్రకటన చేసిన మా ఉద్యోగులలో ఒకరైన నికిత్ శెట్టికి సంబంధించిన తీవ్రమైన సంఘటనను పరిష్కరించడానికి మేము చాలా బాధపడ్డాము. ఈ ప్రవర్తన పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. ఎటియోస్ సర్వీసెస్‌లో మేము పాటించే ప్రధాన విలువలకు విరుద్ధంగా ఉంది" కంపెనీ తెలిపింది. ఈ ఘటనపై నికిత్ శెట్టిపై కేసు నమోదు చేసినట్లు కంపెనీ తెలిపింది.