భర్త చేతిలో పొరుగింటి వ్యక్తి దారుణ హత్య.. భార్యను శృంగారానికి పంపమన్నాడని..

'నీ భార్యను శృంగారం కోసం నా వద్దకు పంపు'అని అడిగినందుకు 45 ఏళ్ల వ్యక్తి తన పొరుగింటి వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు.

By అంజి  Published on  14 March 2023 10:00 AM IST
Bengaluru , Crime news

భర్త చేతిలో పొరుగింటి వ్యక్తి దారుణ హత్య.. భార్యను శృంగారానికి పంపమన్నాడని..

'నీ భార్యను శృంగారం కోసం నా వద్దకు పంపు'అని అడిగినందుకు 45 ఏళ్ల వ్యక్తి తన పొరుగింటి వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన బెంగళూరులోని సిద్ధాపురలో చోటుచేసుకుంది. నిందితుడు సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, మృతుడు మణికంఠగా గుర్తించారు. "ఇది మద్యం మత్తులో గొడవ. మణికంఠ సురేష్ భార్య గురించి మాట్లాడినప్పుడు మద్యం మత్తులో ఉన్నాడు. ఆవేశంలో సురేష్ బెత్తంతో కొట్టి మణికంఠను చంపాడు" అని సౌత్ డీసీపీ తెలిపారు. బాధితుడు, నిందితుడు రోజువారీ కూలీగా పనిచేసేవారు.

హత్యను కప్పిపుచ్చేందుకు సురేష్ స్వయంగా మణికంఠ కుటుంబీకుల వద్దకు వెళ్లి మద్యం తాగి తన వద్ద పడి ఉన్నాడని చెప్పాడు. మణికంఠ మృతి గురించి తెలియని కుటుంబసభ్యులు అతడిని తీసుకొచ్చేందుకు సురేష్‌ ఇంటి వద్దకు వెళ్లారు. కుటుంబీకులు అతడిని తమ వద్దకు తీసుకొచ్చి చూడగా మణికంఠ ముక్కు నుంచి రక్తం రావడం చూశారు. అనంతరం అతడిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మణికంఠ తలకు గాయాలైనట్లు విక్టోరియా ఆస్పత్రి ఫోరెన్సిక్ విభాగం, పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. గురువారం అతని సోదరి ఫిర్యాదు చేసింది.

ఆ ప్రాంతంలోని నిఘా కెమెరాను పరిశీలించిన తర్వాత మణికంఠ మృతదేహాన్ని సురేష్ రోడ్డుపైకి లాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అదుపులోకి తీసుకున్న తర్వాత అంగీకరించాడు. మార్చి 7న తాను, మణికంఠ మద్యం తాగి వీధిలో మాట్లాడుకున్నట్లు అధికారుల వద్ద అంగీకరించాడు. ఆ తర్వాత ఇద్దరు సురేష్ ఇంట్లోకి ప్రవేశించారు. మణికంఠ తన భార్యను సెక్స్‌లో నిమగ్నమవ్వాలని కోరాడు. దీంతో ఆవేశానికి లోనైన సురేష్, మణికంఠ తలపై చెక్క దుంగతో కొట్టి స్పృహతప్పి పడిపోయాడు.

అనంతరం మణికంఠ నిద్రిస్తున్నట్లు కనిపించేందుకు సురేశ్‌ అతడిని బయట పడేశాడు. వీడియోలు, ఇతర ఆధారాల ఆధారంగా ఐపీసీ సెక్షన్ 302, 303 కింద హత్యానేరం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

Next Story