కుక్క మూత్ర విసర్జనపై గొడవ.. ఫ్రెండ్‌ని కొట్టి చంపాడు

బెంగళూరులోని తన ఇంటి ముందు కుక్క విచ్చలవిడిగా మూత్ర విసర్జన చేయడాన్ని వ్యతిరేకించినందుకు 68 ఏళ్ల

By అంజి  Published on  13 April 2023 7:58 AM IST
Bengaluru , Crime news

కుక్క మూత్ర విసర్జనపై గొడవ.. ఫ్రెండ్‌ని కొట్టి చంపాడు

బెంగళూరులోని తన ఇంటి ముందు కుక్క విచ్చలవిడిగా మూత్ర విసర్జన చేయడాన్ని వ్యతిరేకించినందుకు 68 ఏళ్ల వ్యక్తిని అతని పొరుగువారు, అతని స్నేహితుడు కొట్టి చంపారు. సోలదేవనహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గణపతి నగర్‌లో నివాసం ఉంటున్న మునిరాజును హత్య చేసిన కేసులో నిందితుడు ప్రమోద్ ఎన్. బిన్ నరసింహ మూర్తి (27)ను అరెస్టు చేశారు. ఏప్రిల్ 8వ తేదీన ప్రమోద్, అతని స్నేహితుడు రవికుమార్, రవి భార్య పల్లవి కలిసి మునిరాజు ఇంటి ముందు మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో గొడవకు దిగినట్లు సమాచారం.

మునిరాజుతో సన్నిహితంగా ఉండే ప్రమోద్ తన పెంపుడు కుక్కను బయటకు తీసుకెళ్లిన సమయంలో మునిరాజు ఇంటి ముందు కుక్కను మూత్ర విసర్జన చేయించేవాడని విచారణలో తేలింది. ఘటన జరిగిన రోజు మునిరాజు ఇంటి ముందు కుక్క మూత్ర విసర్జన చేయగా, సిగరెట్ తాగుతూ ఇద్దరు గొడవ పడ్డారు. గొడవ తీవ్రమై ప్రమోద్ మునిరాజును చంపాలనే ఉద్దేశ్యంతో బ్యాట్‌తో కొట్టాడని, ఫలితంగా అతను చనిపోయాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచారు.

Next Story