దారుణం.. తిండి పెట్టడానికి డబ్బులు లేవని.. కన్న కూతురిని చంపిన తండ్రి
Bengaluru man kills 2 year old daughter. తిండి పెట్టడానికి డబ్బులు లేవు అన్న కారణంగాతో ఓ వ్యక్తి తన రెండేళ్ల కూతురిని హత్య చేశాడు
By అంజి Published on 28 Nov 2022 11:25 AM ISTతిండి పెట్టడానికి డబ్బులు లేవు అన్న కారణంగాతో ఓ వ్యక్తి తన రెండేళ్ల కూతురిని హత్య చేశాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో వెలుగు చూసింది. గుజరాత్‌కు చెందిన రాహుల్ పార్మర్ అనే వ్యక్తికి భవ్య అనే మహిళతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వారిక రెండేళ్ల పాప ఉంది. వారు గుజరాత్ నుంచి వలస వచ్చి బెంగళూరులో ఉంటున్నారు. గడిచిన ఆరు నెలలుగా పార్మర్‌కు ఉద్యోగం లేదు. అదే టైంలో పార్మర్.. బిట్‌కాయిన్ బిజినెస్‌లో భారీగా డబ్బులు పెట్టి పొగొట్టుకున్నాడు. ఆ తర్వాత తీవ్ర వేదనకు గురయ్యాడు.
అదే సమయంలో పార్మర్ ఇంట్లో బంగారం ఆభరణాలు చోరీ అయ్యాయి. దీనిపై పార్మార్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయం గురించి తెలుసుకునేందుకు పార్మర్ తరచూ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేవాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు దొంగ పార్మరే అని తెలిసింది. తన ఇంట్లో బంగారం ఆభరణలు దొంగిలించి, కుటుంబసభ్యులకు తెలియకుండా వాటిని పార్మర్ తాకట్టు పెట్టాడని పోలీసులకు తెలిసింది. తప్పుడు కేసు నమోదు చేసి పోలీసుల టైంను వృథా చేశాడని తేల్చారు. ఆ తర్వాత ఈ విషయం పార్మర్‌కు తెలిసింది.
ఆ తర్వాత కొన్ని రోజులకు కుమార్తె కనిపించకుండా పోయింది. దీంతో పార్మర్ భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. గత శనివారం రాత్రి.. కెండట్టి గ్రామంలోని ఓ చెరువులో రెండళ్ల చిన్నారి మృతదేహం లభ్యమైంది. ఆ పక్కనే ఓ బ్లూ కలర్ కారు ఆగి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పార్మర్ను అరెస్ట్ చేశారు. తిండి పెట్టడానికి డబ్బులు లేకపోవడంతో సొంత బిడ్డను చంపుకున్నట్టు పార్మర్ తెలిపాడు. కూతురిని చంపిన తర్వాత.. పార్మర్ సూసైడ్‌కు ప్రయత్నించినట్టు తెలిసింది. అయితే సొంత కూతురిని చంపిన నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు.