ఎంబీఏ విద్యార్థినికి సంబంధించిన ప్రైవేట్ వీడియోతో బ్లాక్ మెయిల్ చేసినందుకు కర్ణాటక పోలీసులు శుక్రవారం ఓ మహిళ, ఆమె భర్తను అరెస్టు చేశారు. వీరిద్దరినీ నయన, కిరణ్‌లుగా పోలీసులు గుర్తించారు. నిందితురాలు నయన.. బాధిత విద్యార్థిని బంధువు. నిందితులు కెంగేరి ప్రధాన రహదారిలోని కెంచనాపురలో హోటల్ నడుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎంబీఏ గ్రాడ్యుయేట్ తన ప్రియుడితో కలిసి తరచూ హోటల్‌కు వెళ్లేది. దీంతో నిందితులు వారిని హోటల్ గదిలో కొంత సమయం గడపాలని ప్రోత్సహించారు.
ఆ తర్వాత యువతి తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఉన్న ప్రైవేట్ క్షణాలను చిత్రీకరించారు. కిరణ్ ఫుటేజీని మరింత ఎడిట్ చేసి తన వాట్సాప్‌లో అమ్మాయికి పంపాడు. ఆ యువతి వీడియోను చూసి రూ.లక్ష డిమాండ్ చేసి, ఆ వెంటనే ఆ వీడియోను తొలగించాడు. డబ్బు చెల్లించకుంటే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని, ఆమె పరిచయస్తులందరికీ షేర్ చేస్తానని బెదిరించాడు. నిందితురాలు నయన కూడా బ్లాక్‌మెయిల్ చేసి బెదిరించింది. దీంతో బాధితురాలు చంద్రలేఅవుట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే నిందితులను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.