కండక్టర్‌ను కత్తితో పొడిచిన ప్రయాణికుడు.. ఫుట్‌బోర్డ్‌పై నిలబడవద్దని చెప్పినందుకు

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారునం జరిగింది. బస్సులో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించవద్దని చెప్పినందుకు కండక్టర్‌ను ఓ ప్రయాణికుడు కత్తితో పొడిచాడు.

By అంజి  Published on  2 Oct 2024 11:27 AM IST
Bengaluru, bus conductor, passenge, footboard, stabbed, Crime

కండక్టర్‌ను కత్తితో పొడిచిన ప్రయాణికుడు.. ఫుట్‌బోర్డ్‌పై నిలబడవద్దని చెప్పినందుకు..

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారునం జరిగింది. బస్సులో ఫుట్‌బోర్డ్‌పై ప్రయాణించవద్దని చెప్పినందుకు కండక్టర్‌ను ఓ ప్రయాణికుడు కత్తితో పొడిచాడు. అక్టోబరు 1, మంగళవారం నాడు చోటు చేసుకున్న ఈ ఘటనలో 45 ఏళ్ల బస్సు కండక్టర్ గాయపడ్డాడు. జార్ఖండ్‌కు చెందిన హర్ష్ సిన్హా అనే నిందితుడిని ప్రయాణికులు పట్టుకుని పోలీసులకు అప్పగించగా, గాయపడిన కండక్టర్ యోగేష్‌ను ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు, అక్కడ కండక్టర్‌ చికిత్స పొందుతున్నాడు.

నిందితుడు బెంగళూరులోని ఒక కాల్ సెంటర్‌లో పని చేస్తూ సెప్టెంబర్ 20న విధుల నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ)కి చెందిన బస్సు మంగళవారం సాయంత్రం వైట్‌ఫీల్డ్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండగా ఈ ఘటన జరిగింది. భారతీయ న్యాయ సంహిత (BNS) యొక్క సంబంధిత సెక్షన్ల కింద ఈ సంఘటన తర్వాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై తదుపరి విచారణ ప్రారంభించారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో, 35 ఏళ్ల బెంగళూరు క్యాబ్ డ్రైవర్ తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించినందుకు తన స్నేహితురాలిని బహిరంగంగా పలుమార్లు కత్తితో పొడిచాడు. ఆ వ్యక్తి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి అక్కడ నేరాన్ని అంగీకరించాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కత్తిపోట్లతో మహిళ మృతి చెందగా, ఆమె మృతదేహాన్ని పోలీసులు నేరస్థలంలో కనుగొన్నారు.

Next Story