దారుణం.. భార్యను చంపి ముక్కలుగా నరికి నదిలో పడేసిన భర్త

Bengal man chops wife's body into pieces over suspicion of illicit affair. ఢిల్లీలో తన లైవ్-ఇన్-పార్ట్‌నర్ చేతిలో హత్యకు గురైన శ్రద్ధా వాకర్ దారుణ హత్యకు సంబంధించిన

By అంజి  Published on  6 Jan 2023 2:45 PM IST
దారుణం.. భార్యను చంపి ముక్కలుగా నరికి నదిలో పడేసిన భర్త

ఢిల్లీలో తన లైవ్-ఇన్-పార్ట్‌నర్ చేతిలో హత్యకు గురైన శ్రద్ధా వాకర్ దారుణ హత్యకు సంబంధించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే ఒకటి.. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలో తెరపైకి వచ్చింది. వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి, మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికి మహానంద నదిలో పడేశాడు. పోలీసులు నిందితుడిని అరెస్టు చేయగా, మహిళ శరీర భాగాలను గుర్తించేందుకు గాలిస్తున్నారు.

డార్జిలింగ్ జిల్లాలోని సిలిగురికి చెందిన రేణుకా ఖతున్ అనే మహిళ చాలా రోజులుగా కనిపించకుండా పోయింది. ఆమె బంధువులు డిసెంబర్ చివరి వారంలో మిస్సింగ్ రిపోర్టును దాఖలు చేశారు. ఫిర్యాదు మేరకు సిలిగురి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. విచారణలో, పోలీసులు రేణుక భర్త మహ్మద్ అన్సరుల్‌ను విచారించగా, అతను తన భార్యను చంపి, నదిలో పడవేసే ముందు మృతదేహాన్ని రెండు ముక్కలుగా నరికివేసినట్లు అంగీకరించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని అన్సరుల్ అనుమానించి, ఆ తర్వాత ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు.

డిసెంబర్ 24న అన్సరుల్ తన భార్యను గొంతు కోసి హత్య చేసి మృతదేహాన్ని రెండు ముక్కలు చేశాడు. డైవర్ల సహాయంతో రేణుక శరీర భాగాలను గుర్తించి, వెలికి తీయడానికి అన్వేషణ కొనసాగుతోంది.

Next Story