విషాదం.. బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి సూసైడ్‌

Basara IIIT Student commits suicide. కాలేజీ హాస్టల్‌లో ఆదివారం రాత్రి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో నిర్మల్‌ జిల్లా బాసర

By అంజి  Published on  19 Dec 2022 9:43 AM IST
విషాదం.. బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థి సూసైడ్‌

కాలేజీ హాస్టల్‌లో ఆదివారం రాత్రి విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో నిర్మల్‌ జిల్లా బాసర ఐఐఐటీలో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. మృతుడు రంగారెడ్డి జిల్లా మంచాల్‌కు చెందిన భాను ప్రసాద్‌గా గుర్తించారు. పీయూసీ-2 చదువుతూ బాలుర హాస్టల్‌ 2లో ఉంటున్న భాను ప్రసాద్‌గా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుడి జేబులో సూసైడ్ నోట్ పోలీసులకు లభించినట్లు సమాచారం.

అతని ఆత్మహత్యకు ఒత్తిళ్లు, కఠినమైన నిబంధనలే కారణమని విద్యార్థులు ఆరోపిస్తూ అతని సూసైడ్ నోట్‌ను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. పరిపాలనా కార్యాలయం ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. భాను ప్రసాద్‌ గతంలోనూ ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది. విద్యార్థి మృతి పట్ల వీసీ వెంకటరమణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థి ఆత్మహత్యకు వ్యక్తిగత కారణాలే కారణమని వీసీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతి నేపథ్యంలో ట్రిపుల్‌ ఐటీలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Next Story