నీటిని త‌ప్పుగా అంచనా వేశారు. ప్రాణాలు పోగొట్టుకున్న‌ బ్యాంక్ మేనేజర్‌, క్యాషియర్‌

అండర్‌పాస్‌లో నుండి ఎస్‌యూవీ వాహనంలో వెళ్లిపోవాలని భావించి ప్రాణాలు కోల్పోయారు

By Medi Samrat  Published on  14 Sept 2024 2:00 PM IST
నీటిని త‌ప్పుగా అంచనా వేశారు. ప్రాణాలు పోగొట్టుకున్న‌ బ్యాంక్ మేనేజర్‌, క్యాషియర్‌

అండర్‌పాస్‌లో నుండి ఎస్‌యూవీ వాహనంలో వెళ్లిపోవాలని భావించి ప్రాణాలు కోల్పోయారు. కారు నీటిలో మునిగిపోవడంతో బ్యాంక్ మేనేజర్, క్యాషియర్ మరణించారు. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్‌సిఆర్) లో భారీ వర్షాలకు అండర్‌పాస్ కూడా జలమయమైంది.

గురుగ్రామ్ సెక్టార్ 31లోని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌గా ఉన్న పుణ్యశ్రేయ శర్మ, అక్కడ క్యాషియర్‌గా ఉన్న విరాజ్ ద్వివేది శుక్రవారం సాయంత్రం మహీంద్రా ఎక్స్‌యువి 700లో ఫరీదాబాద్‌కు వెళుతున్నారని పోలీసులు తెలిపారు. వారు ఓల్డ్ ఫరీదాబాద్ రైల్వే అండర్‌పాస్ వద్దకు చేరుకునే సమయానికి భారీగా నీరు చేరి ఉంది. అయితే నీటిని అంచనా వేయడంలో విఫలమయ్యారు. SUV మునిగిపోవడం ప్రారంభించిన తర్వాత ఇద్దరు వ్యక్తులు వాహనం నుండి దిగి ఈదడానికి ప్రయత్నించారు, కానీ మునిగిపోయారు. ఒక ఎస్‌యూవీ ఇరుక్కుపోయిందని సమాచారం అందుకున్న పోలీసుల బృందం అండర్‌పాస్‌ దగ్గరకు చేరుకుంది. శర్మ మృతదేహాన్ని వాహనం నుండి బయటకు తీయగా, గంటల తరబడి సెర్చ్ ఆపరేషన్ చేసిన తరువాత తెల్లవారుజామున 4 గంటలకు ద్వివేది మృతదేహం కనుగొన్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.

Next Story