బంజారాహిల్స్‌లో బెంజ్‌ కారు బీభత్సం

Banjara hills Car accident.. బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 3లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ

By సుభాష్  Published on  22 Nov 2020 2:38 AM GMT
బంజారాహిల్స్‌లో బెంజ్‌ కారు బీభత్సం

బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబర్‌ 3లో అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వచ్చిన బెంజ్‌కారు ఇండికా కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇండికా కారులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఢీకొట్టిన వారు ఓ పబ్‌లో మద్యం తాగి బెంజ్‌కారులో వేగంగా వెళ్తూ రోడ్డుపైకి దూసుకొచ్చినట్లు పలువురు తెలిపారు. ప్రమాదం సమయంలో బెంజ్ కారులో ముగ్గురు యువకులు, ఒక యువతి ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడికి పోలీసులు చేరుకుని కారు నడిపిన వ్యక్తి హార్థిక్‌రెడ్డి సహా అఖిల్‌, ప్రమోద్‌లను అదుపులోకి తీసుకున్నారు. కారులో ఉన్నవారు ఫుల్లుగా మద్యం తాగి ఉన్నట్లు గుర్తించారు.

కాగా, బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 3 వద్ద ఉన్న రాయల్‌ టిఫిన్‌ సెంటర్‌ డేంజర్‌ స్పాట్‌గా మారింది. ఇక్కడ ఇది వరకు ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ప్రాణాలు కోల్పోయిన సందర్భాలున్నాయిన స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో స్పీడు బ్రేకులు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలను నివారించాలని వాహనదారులు కోరుతున్నారు. ఇలా నగరంలో మద్యం తాగి ఎన్నో రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలో కరోనా కారణంగా ఎలాంటి డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహించడం లేదు. దీంతో మందు బాబులకు ఆడింది ఆటగా మారింది. పోలీసులు ప్రతి రోజు డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించి కేసులు నమోదు చేసేవారు. కానీ కారోనా కారణంగా ఎలాంటి తనిఖీలు చేపట్టకపోగా, వారికి భయం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల సీపీ సజ్జనార్‌ మాదాపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని మరింత అప్రమత్తం అయ్యారు. ఇక ప్రతి రోజు డ్రంకెన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తామని చెప్పారు. మద్యం తాగి, ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడిపితే పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు.

Next Story