దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై స్కూల్ ప్రిన్సిపాల్ డ్రైవర్ అఘాయిత్యం
Banjara Hills 4-year-old girl sexually assaulted by School Principal's driver.పాఠశాలలో కూడా చిన్నారులకు రక్షణ
By తోట వంశీ కుమార్ Published on 19 Oct 2022 2:29 AM GMTపాఠశాలలో కూడా చిన్నారులకు రక్షణ లేకుండా పోతుంది. అభం, శుభం తెలియని చిన్నారులపై మానవమృగాలు దారుణాలకు పాల్పడుతున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగేళ్ల బాలికపై పాఠశాల ప్రిన్సిపాల్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు.
గత రెండు నెలలుగా డ్రైవర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. చాలా కాలంగా బాలిక ప్రవర్తనలో మార్పు రావడం తల్లితండ్రులు గమనించారు. ఏదైన విషయాన్ని అడిగినా బాలిక చెప్పలేకపోయింది. అయితే.. సోమవారం చిన్నారి ఏడుస్తున్నట్లు గుర్తించారు. ఆ తరువాత చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు తెలిసింది.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిన్సిపాల్ కారు డ్రైవర్ గా ఉన్న వ్యక్తి డిజిటల్ క్లాస్‌రూమ్‌లోకి వచ్చి పిల్లలను ఇబ్బందులకు గురి చేసేవాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. చాలా మంది చిన్నారులు అతడికి భయపడ్డారన్నారు. అతడి చేష్టల నుంచి పిల్లలను రక్షించాలని కోరారు. విషయం తెలుసుకున్న పలువురు చిన్నారుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని నిందితుడిని చితకబాదారు.
Two years girl has been raped and been harressing by BSD DAV SCHOOL BANJARA HILLS pricipal driver(RAJASEKHAR).@RachakondaCop @KTRTRS @TelanganaCMO @
— Kasam Bhaskar (@BhaskarKasam) October 18, 2022
మరోవైపు ఈ ఘటనను హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్ (హెచ్‌ఎస్‌పీఏ) ఖండించింది. "HSPA అటువంటి సంఘటనలను ఖండిస్తుంది మరియు కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను అభ్యర్థిస్తుంది" అని HSPA యొక్క అధికారిక ప్రకటన పేర్కొంది.
తాజా సమాచారం ప్రకారం నిందితుడిపై పోలీసులు పోస్కో కింద కేసు నమోదు చేశారు.