బంగ్లాదేశ్‌కు చెందిన 35 ఏళ్ల మహిళ బెంగళూరులోని ఓ చెరువు సమీపంలో శవమై కనిపించింది. ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న బాధితురాలిని హత్య చేశారని, హత్య చేయడానికి ముందు లైంగిక వేధింపులు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలు అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కలకెరెలోని డిఎస్‌ఆర్ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న మహిళను గొంతు నులిమి చంపే ముందు లైంగిక దాడి చేశారని, ఆమె ముఖంపై బండరాయిని మోదినట్లు ప్రాథమిక పరిశోధనలు చెబుతున్నాయి. ఆమె మృతదేహాన్ని నిర్జన ప్రాంతంలో పడేశారు.
గురువారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లిన మహిళ త్వరగా వస్తానని కుటుంబసభ్యులకు చెప్పి వెళ్ళింది.. ఆ తర్వాత తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ తెలియకపోవడంతో ఆందోళన చెందిన ఆమె భర్త, స్నేహితులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు. తరువాత రామమూర్తి నగర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం ఉదయం రాంపుర లేక్ సమీపంలో ఓ వ్యక్తి గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితురాలి గుర్తింపును నిర్ధారించారు.
బంగ్లాదేశ్‌కు చెందిన బాధితురాలికి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. బాధితురాలి భర్త తన పాస్‌పోర్ట్‌ని ఉపయోగించి భారత్ లోకి ప్రవేశించాడు, కాని భార్యకు పాస్‌పోర్ట్ లేదు. ఆమె అక్రమంగా ప్రవేశించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన మహిళ గత ఆరు సంవత్సరాల కాలంగా బెంగళూరు నగరంలో పని చేస్తోందని అధికారులు తెలిపారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా, లైంగిక వేధింపులకు సంబంధించిన ఆధారాలు కనుగొన్నారు. హత్య, లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. హత్యకు ముందు మహిళపై అత్యాచారం జరిగిందో లేదో నిర్ధారించేందుకు పోస్ట్‌మార్టం రిపోర్టు కోసం పోలీసులు ఎదురుచూస్తున్నారు.