హైదరాబాద్‌లో కిడ్నాప్‌కు గురైన పసికందు సేఫ్

కొన్ని నెలలుగా తాను చూసుకుంటున్న కవల బాలికల్లో ఒకరిని కిడ్నాప్ చేసిన మహిళను ఆదివారం జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు.

By అంజి  Published on  3 March 2024 12:49 PM IST
Baby kidnap, Hyderabad , rescue, Zaheerabad

హైదరాబాద్‌లో కిడ్నాప్‌కు గురైన పసికందు సేఫ్

హైదరాబాద్‌ నగరంలోని పాతబస్తీ మాదన్నపేటలో కొన్ని నెలలుగా తాను చూసుకుంటున్న కవల బాలికల్లో ఒకరిని కిడ్నాప్ చేసిన మహిళను ఆదివారం జహీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. గంటల వ్యవధిలోనే చిన్నారిని జహీరాబాద్‌లో గుర్తించిన పోలీసులు.. కిడ్నాపర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కవల బాలికల తల్లిదండ్రులు ఒక బిడ్డకు జ్వరం రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు, మరొక బిడ్డను కేర్‌టేకర్ షాజహానా బేగం సంరక్షణలో ఉంచారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి షాజహానా, చిన్నారి కనిపించడం లేదు.

వారు వెంటనే మాదన్నపేట పోలీసులను ఆశ్రయించారు. ఇమ్లిబున్‌లోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ నుండి జహీరాబాద్‌కు వెళ్లే బస్సులో షాజహానా బేగం ఎక్కినట్లు సిసిటివి దృశ్యాలు కనిపించాయి. దీంతో మాదన్నపేట పోలీసులు జహీరాబాద్ పోలీసులకు సమాచారం అందించగా, బస్సు జహీరాబాద్ చేరుకోగానే మహిళను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారిని వారి తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో గంటల వ్యవధిలోనే కేసును ఛేదించిన పోలీసులకు పాప తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story