శంషాబాద్‌లో దారుణం.. బాలికపై బాబాయి అత్యాచారం

మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతుంది. రోజురోజుకు వారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  23 Jun 2024 9:37 AM IST
babai, rape,  girl, shamshabad, crime,

శంషాబాద్‌లో దారుణం.. బాలికపై బాబాయి అత్యాచారం

మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోతుంది. రోజురోజుకు వారిపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి వావివరుసలు లేకుండా ప్రవర్తిస్తున్నారు కామాంధులు. సొంత ఇంట్లో కూడా అమ్మాయిలకు రక్షణ లేకపోవడంతో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వరుసకు అన్న... తండ్రి అయిన వారు కూడా జీవితాలను చిదిమేస్తున్నారు. తాజాగా శంషాబాద్‌లో మరో దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది. వరుసకు బాబాయిన అయిన వ్యక్తే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఒంటరిగా ఉన్న సమయంలో బెదిరింపులకు పాల్పడి లైంగిక దాడి చేశాడు.

శంషాబాద్‌కు చెందిన ఒక దంపతులు రోజువారీ కూలీలుగా జీవనం సాగిస్తున్నారు. అయితే.. అనారోగ్యం బారిన పడ్డ భర్త రెండు నెలల క్రితమే చనిపోయాడు. ఆర్థిక ఇబ్బందులను మహిళ ఒంటరిగా ఎదుర్కొంటోంది. కాయాకష్టం చేసి కుటుంబాన్ని పోషిస్తోంది. 14 ఏళ్ల కుమార్తెను చదవిస్తూ.. ఆమె జీవనాన్ని ముందుకు లాగుతోంది. అయితే.. ఇంటి పక్కనే ఉన్న సొంత బాబాయి చిన్నారిపై కన్నేశాడు. వావివరుసలు మరిచి.. కామంతో ప్రవర్తించాడు. ఇంట్లో బాలిక తల్లి లేని సమయంలో చొరబడ్డాడు. బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్ఆనంటూ బెదిరించాడు. ఈ దారుణ సంఘటన ఈ నెల 20వ తేదీన చోటు చేసుకుంది. బాలిక తల్లి ఆలస్యంగా విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్నారిపై బాబాయి అత్యాచారానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది.

కాగా.. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌లోని మియాపూర్‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. తండ్రే కూతురిపై లైంగికదాడి చేశాడు. మద్యానికి బానిసైన అతను కూతురుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక అరవడంతో ఆమెను బండరాయితో కొట్టి చంపేశాడు. చివరకు పోలీసులు అతన్ని కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Next Story