విజయవాడలో దారుణం.. అత్తను నరికిచంపిన అల్లుడు
విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యను కాపురానికి పంపకుండా, విడాకుల కోసం కోర్టులో కేసు వేశారని అక్కసుతో
By అంజి Published on 25 Jun 2023 3:55 PM ISTవిజయవాడలో దారుణం.. అత్తను నరికిచంపిన అల్లుడు
ఏపీ: విజయవాడలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తన భార్యను కాపురానికి పంపకుండా, విడాకుల కోసం కోర్టులో కేసు వేశారని అక్కసుతో అత్తను వెంటాడి మరీ.. నడిరోడ్డుపై నరికి చంపాడో అల్లుడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. నగరంలోని చిట్టీనగర్ సమీపంలోని చనమోలు వెంకట్రావు బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వైఎస్‌ఆర్ కాలనీలో నాగమణి, గురుస్వామిలు నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు కూతుర్లు. రెండు కూతురు లలితను ఏకలవ్యనగర్‌కు చెందిని కుంబా రాజేశ్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. 15 ఏళ్ల క్రితం వీరి పెళ్లి కాగా, ఇద్దరు సంతానం. రాజేష్ ఓ బిర్యానీ పాయింట్‌లో పని చేస్తున్నాడు. భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. పోలీస్‌స్టేషన్‌లో కేసులు కూడా నడిచాయి.
సంవత్సరం కిందట తన భర్త నుండి తనకు విడాకులు కావాలని లలిత కోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఈ క్రమంలోనే భార్యను కాపురానికి పంపకుండా వేధిస్తున్నారని, విడాకుల కోసం కోర్టులో కేసు వేశారనే కక్షలతో అల్లుడు రాజేశ్ ఆదివారం విజయవాడలో అత్త నాగమణి, మామ గురుస్వామిని వెంబడించి వెంకట్రావు వంతెన దొరకపట్టుకున్నాడు. నడిరోడ్డుపై ముందుగా అత్తపై దాడిచేసి నరికి చంపాడు. అదే సమయంలో మామ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ప్రాణాలు కాపాడుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. హత్య చేసిన తర్వాత నిందితుడు తన వాహనంతో పరారయ్యాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.