Video: వికారాబాద్‌లో దారుణం.. భార్యను కొట్టి చంపిన భర్త, అత్తమామలు

వికారాబాద్‌ జిల్లా సాయిపూర్‌లో దారుణం జరిగింది. పరమేశ్‌ అనే వ్యక్తి భార్య అనూషను దారుణంగా కొట్టి చంపాడు.

By -  అంజి
Published on : 19 Dec 2025 4:43 PM IST

Saipur, Vikarabad district, Husband and in-laws beat wife to death, Crime

Video: వికారాబాద్‌లో దారుణం.. భార్యను కొట్టి చంపిన భర్త, అత్తమామలు

వికారాబాద్‌ జిల్లా సాయిపూర్‌లో దారుణం జరిగింది. పరమేశ్‌ అనే వ్యక్తి భార్య అనూషను దారుణంగా కొట్టి చంపాడు. 8 నెలల క్రితమే వీరు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహం పరమేష్ తల్లిదండ్రులైన లాలమ్మ, మొగులప్పలకు మొదటి నుంచీ ఇష్టం లేదు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ప్రేమ వివాహం కావడం, దానికి తోడు అదనపు వరకట్నం తీసుకురావాలని అత్తమామలు అనూషను వేధిస్తుండేవారు. ఈ క్రమంలోనే పరమేశ్‌ కుటుంబం అనూషతో తరచూ గొడవలకు దిగేది.

తాజాగా మాటామాటా పెరగడంతో అనూషను పరమేశ్‌ కర్రతో కొట్టి చంపాడు. అనంతరం కుటుంబ సభ్యులతో పరారయ్యాడు. అయితే ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయ్యాయి. అనూష తల్లి చంద్రమ్మ తన కూతురు మరణంపై ఆవేదన వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story