Telangana: దారుణం.. ఛాయ్‌ తెచ్చిన గొడవ.. కోడలిని చున్నీతో చంపిన అత్త

రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ అత్త తన కోడలును అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.

By అంజి  Published on  27 Jun 2024 8:30 PM IST
Ranga Reddy district, Crime, Murder

Telangana: దారుణం.. ఛాయ్‌ తెచ్చిన గొడవ.. కోడలిని చున్నీతో చంపిన అత్త

రంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ అత్త తన కోడలును అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సంగారెడ్డికి చెందిన పర్వీనా బేగం అనే యువతికి 10 సంవత్సరాల క్రితం అబ్బాస్ అనే యువకుడితో వివాహం జరిగింది. అబ్బాస్ ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. అయితే అత్త అజ్మీరకు కోడలు పర్వీనా బేగంకు మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి.

ఈ క్రమంలోనే కోడలు చాయ్ పెట్టమని అత్తకు చెప్పింది. అత్తనైన తనకే చాయి పెట్టామని చెప్పినందుకు అజ్మీరాకు కోపం వచ్చింది. దీంతో ఆగ్రహానికి లోనైనా అత్త అజ్మీర వెంటనే చున్ని తీసుకొని వెళ్లి కోడలు పర్వీన్ బేగం గొంతుకు బిగించి గట్టిగా లాగి చంపేసింది. కోడల్ని హత్య చేసిన అనంతరం అత్త అజ్మీర అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌కు నేరుగా వెళ్లి లొంగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. అత్తను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగించారు.

Next Story