పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రంగా కాలనీలో విషాదం చోటు చేసుకుంది. భార్య గొంతు నులిమి చంపిన ఓ భర్త తానూ పురుగులమందు తిని చనిపోవాలని
By M.S.R Published on 7 Jun 2023 5:30 PM ISTపల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దారుణం
పల్నాడు జిల్లా సత్తెనపల్లి రంగా కాలనీలో విషాదం చోటు చేసుకుంది. భార్య గొంతు నులిమి చంపిన ఓ భర్త తానూ పురుగులమందు తిని చనిపోవాలని అనుకున్నాడు. అతడు ఆత్మహత్యప్రయత్నం చేశాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి నిలకడగా ఉంది. కొంతకాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని.. ఈ హత్యకు అదే కారణం అయి ఉండొచ్చని స్థానికులు చెబుతున్నారు.
సత్తెనపల్లి మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన ఒంటిపులి కార్తీక్.. సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీకి చెందిన పల్లపు అరుణ ను మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత కొంత కాలంగా భార్యపై అనుమానం పెంచుకున్న కార్తీక్ ఆమెను తరచూ వేధిస్తున్నాడు. ఈనేపథ్యంలో వారిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. 10 రోజుల క్రితం భీమవరం నుంచి రంగా కాలనీకి వచ్చిన దంపతులు ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య మంగళవారం అర్ధరాత్రి మరోసారి వాగ్వాదం జరిగింది. కార్తీక్ అరుణ గొంతు నులిమి కిరాతంగా చంపేశాడు. అనంతరం అతడు కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కార్తీక్‌ను సమీపంలోని ఆసుపత్రికి.. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. ప్రస్తుతం కార్తీక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పోలీసులు తెలిపారు. భార్యపై ఉన్న అనుమానం కారణంగా కార్తీక్ ఈ పని చేశాడని అంటున్నారు.