తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో డిసెంబర్ 28, శనివారం నాడు ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు బస్టాప్‌లో వేచి ఉండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు నిజామాబాద్ జిల్లా నుంచి నిర్మల్‌కు వెళ్లే బస్టాప్‌లో ఆటో కోసం ఎదురుచూస్తోంది. ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు ఆమె దగ్గరకు వచ్చారు. వారు అకస్మాత్తుగా ఆమెను బస్టాప్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశంలోకి లాగి నేరానికి పాల్పడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతోంది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నిర్మల్ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు స్పృహలోకి వచ్చిన తర్వాత వాంగ్మూలాన్ని నమోదు చేస్తామని నిర్మల్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) గంగారెడ్డి తెలిపారు. అత్యాచారంలో ఎంత మంది వ్యక్తులు పాల్గొన్నారు అనేది తెలుసుకోవడానికి వాంగ్మూలం కీలకం కానుంది.