పెరులో ఘోర రోడ్డు ప్రమాదం.. 27 మంది దుర్మరణం
At least 27 dead in bus accident in southern Peru.పెరూలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం
By తోట వంశీ కుమార్ Published on
19 Jun 2021 4:15 AM GMT

పెరూలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెలుతున్న బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 27 మంది దుర్మరణం చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పాలొమినో కంపెనీకి చెందిన బస్సులో పలు కుటుంబానికి చెందిన కొందరు పెరూలోని అయాకుచో నుంచి అరెక్విపా వెళ్తున్న క్రమంలో ఇంటరియోసియానిక్ జాతీయ రహదారిపై అదుపు తప్పిన బస్సు ఒక్కసారిగా లోయలో పడిపోయింది.
దీంతో 27 మంది చనిపోగా.. మరో 20 మంది తీవ్రంగా పడినట్లు అధికారులు వెల్లడించారు. ఈఘటన పెరూ రాజధాని లిమా నగరానికి 600 కిలోమీటర్ల దూరంలో జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం మృతదేహాలను గుర్తించే పనిలో ఉన్నారు.
Next Story