Asifabad: అనుమానంతో భార్యను భర్త నరికి చంపాడు

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం దాబా గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. శనివారం అర్ధరాత్రి భర్త తన భార్యపై

By అంజి  Published on  7 May 2023 2:30 PM IST
Asifabad district, Crime news, husband

Asifabad: అనుమానంతో భార్యను భర్త నరికి చంపాడు

కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం దాబా గ్రామంలో దారుణ ఘటన వెలుగు చూసింది. శనివారం అర్ధరాత్రి భర్త తన భార్యపై అనుమానంతో గొడ్డలితో దాడి చేయడంతో.. ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి . మహిళను వడై సంగీత అలియాస్ అమృత (25)గా గుర్తించామని, గాయపడిన వ్యక్తి ఆసిఫాబాద్‌లోని దాబాకు చెందిన పచ్చు అని వాంకిడి ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.

అర్ధరాత్రి 12.30 గంటల ప్రాంతంలో భర్త మారుతి భార్య మెడపై గొడ్డలితో దాడి చేశాడు. దీంతో భార్య సంగీతకు తీవ్ర గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఆమె శవమై కనిపించింది. సంగీతపై మారుతీ దాడి చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించిన పచ్చుకు శరీరంలోని వివిధ భాగాలపై గాయాలయ్యాయి. పచ్చుతో వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో మారుతీ తన భార్య, పచ్చుపై దాడి చేసినట్లు సమాచారం. సంగీత తండ్రి బాబాజీ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేశారు.

Next Story