మేనకోడలిపై లైంగికదాడి.. ఆపై హత్య చేసిన ఆర్మీ అధికారి

తమిళనాడులోని మధురైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్‌ను ఆమె అత్త, భారత సైన్యంలోని అధికారి అయిన మామ లైంగికంగా వేధించడంతో పాటు హత్య చేశారు.

By అంజి  Published on  28 March 2024 6:56 AM IST
Army officer, Crime news, Tamil Nadu, Madurai

మేనకోడలిపై లైంగికదాడి.. ఆపై హత్య చేసిన ఆర్మీ అధికారి

తమిళనాడులోని మధురైలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్‌ను ఆమె అత్త, భారత సైన్యంలోని అధికారి అయిన మామ లైంగికంగా వేధించడంతో పాటు హత్య చేశారు. ఈ సంఘటన మార్చి 22 న జరిగింది. 11 ఏళ్ల బాలికను అత్త ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు చనిపోవడంతో చిన్నారిని వదిలేసి వెళ్లిపోయారు. తరువాత ఆమె తన మామ, అత్తతో కలిసి జీవించడం ప్రారంభించింది. ఈ నెల 22న అపస్మారక స్థితిలో ఆసుపత్రికి తీసుకువచ్చిన చిన్నారి, ఆసుపత్రిలో మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

ఆ తర్వాత, చిన్నారి పోస్ట్‌మార్టం నివేదికలో ఆమె లైంగిక వేధింపులకు గురై ఊపిరాడక చనిపోయిందని నిర్ధారించింది. కేసు దర్యాప్తు ముమ్మరం చేయగా, చిన్నారి మామ ఆమెపై దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. లైంగిక వేధింపుల గురించి ఆమె అత్తకు తెలుసు, కానీ దానిని కప్పిపుచ్చడానికి ప్రయత్నించింది. ఇదిలా ఉండగా పోలీసులు దంపతులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించి తదుపరి విచారణలు జరుగుతున్నాయి.

Next Story