Peddapalli: బెట్టింగ్ యాప్‌లకు మరో యువకుడు బలి
బెట్టింగ్ యాప్‌లకు మరో యువకుడు బలైనా ఘటనా పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
By అంజి
Peddapalli: బెట్టింగ్ యాప్‌లకు మరో యువకుడు బలి
బెట్టింగ్ యాప్‌లకు మరో యువకుడు బలైనా ఘటనా పెద్దపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా మంథిని మండలంలోని విలోచవరం గ్రామానికి చెందిన కొరవేన సాయి తేజ్ అనే యువకుడు గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాడు. ఇతను బెట్టింగ్ యాప్‌లకు అలవాటు పడ్డాడు. ఇంట్లో తల్లిదండ్రులకు తెలియకుండా బెట్టింగ్ యాప్‌లో గేమ్స్ ఆడి తీవ్ర స్థాయిలో నష్టపోయాడు. అటు అప్పులు తీర్చలేక ఇటు తల్లిదండ్రులకు తన ఆవేదన వ్యక్తం చేయలేక తీవ్ర మనస్థాపానికి గురైన సాయి తేజ్ మూడు రోజుల క్రితం రామగిరి మండలంలోని సింగిరెడ్డిపల్లి గ్రామ శివారులో గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
అది గమనించిన కొంతమంది స్థానికులు అతన్ని వెంటనే కరీంనగర్ హాస్పిటల్ కి తరలించారు. గత రెండు రోజులుగా కరీంనగర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సాయి తేజ్ ఈరోజు ఉదయం మృతి చెందాడు. సాయి తేజ్ మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. యువత బెట్టింగ్ యాప్‌లకు అలవాటు పడి అప్పుల పాలై మనస్థాపానికి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసిన వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు బెట్టింగ్ ప్రమోషన్ చేసిన యూట్యూబర్లు యాంకర్స్ సినీ ప్రముఖులపై కేసులు నమోదు చేసి నోటీసులు జారీ చేస్తున్నారు.