విపరీతంగా పూజలు చేస్తోందని భార్యపై పెట్రోల్ పోసిన భర్త.. ప‌క్క‌నే దీపం ఉండ‌టంతో..

56 ఏళ్ల వ్యక్తి తన 50 ఏళ్ల భార్యకు నిప్పంటించాడు. ఆమె మితిమీరిన భక్తి కారణంగా గొడవ జరిగిందని తెలుస్తోంది.

By Kalasani Durgapraveen  Published on  22 Nov 2024 3:00 PM IST
విపరీతంగా పూజలు చేస్తోందని భార్యపై పెట్రోల్ పోసిన భర్త.. ప‌క్క‌నే దీపం ఉండ‌టంతో..

56 ఏళ్ల వ్యక్తి తన 50 ఏళ్ల భార్యకు నిప్పంటించాడు. ఆమె మితిమీరిన భక్తి కారణంగా గొడవ జరిగిందని తెలుస్తోంది. భార్యతో గొడవ పడుతుండగా అనుకోకుండా నిప్పంటించాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిల్లా తిరువెరంబూర్‌లో చోటుచేసుకుంది. రాజేంద్ర ప్రసాద్ తన భార్య హిమ బిందు భక్తి కారణంగా చాలా విసుగు చెందాడు. ఆమె తన కుటుంబాన్ని పట్టించుకోకుండా ప్రార్థనలు చేస్తూ గడుపుతూ ఉండేది.

బుధవారం రాత్రి 11 గంటలకు కూడా బిందు పూజలు చేస్తూ ఉండడంపై ప్రసాద్ ఆమెతో వాదించడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ప్రసాద్ తన ద్విచక్ర వాహనం కోసం వాడేందుకు సీసాలో ఉంచిన పెట్రోల్‌ను ఆమెపై పోసి నిప్పంటించాడు.

పక్కనే ఉన్న దీపం కారణంగా పెట్రోల్‌కు మంటలు అంటుకున్నాయి. ప్రసాద్, బిందు ఇద్దరూ మంటల్లో చిక్కుకున్నారు. వారిద్దరినీ కాపాడేందుకు ప్రయత్నించిన వారి కుమారులు గుణశేఖర్, గురుసామిలకు కూడా కాలిన గాయాలయ్యాయి. నలుగురిని తిరుచ్చి ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు, అక్కడ ప్రసాద్, బిందు పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై నవలపట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story