దారుణం.. మత్తు మందు ఇచ్చి ఇద్దరు బాలికలపై అత్యాచారం

అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. రోజురోజుకు అత్యాచార సంఘటనలు పెరిగిపోతున్నాయి.

By Srikanth Gundamalla  Published on  15 Feb 2024 3:20 PM IST
andhra pradesh, rape,  two minor girls, palnadu,

దారుణం.. మత్తు మందు ఇచ్చి ఇద్దరు బాలికలపై అత్యాచారం

అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయింది. రోజురోజుకు అత్యాచార సంఘటనలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో చోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే తెలిసిన వారు.. బంధువులు.. సొంత మనుషులే అత్యాచారాలకు పాల్పడి అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా పల్నాడు జిల్లాలో కూడా ఇద్దరు బాలికపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. మత్తుమందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డ ఈ సంఘటన జిల్లాలో కలకలం రేపుతోంది.

నరసరావుపేటలో బుధవారం సాయంత్రం నుంచి ఇద్దరు బాలికలు కనిపించకుండా పోయారు. దాంతో.. వారి తల్లిదండ్రులు కంగారుపడిపోయారు. చుట్టుపక్కల.. స్నేహితుల ఇళ్లలో అడిగినా ఫలితం లేకపోయింది. దాంతో.. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు అప్రమత్తయ్యారు. వారిని వెతికేందుకు రంగంలోకి దిగారు. ఇతర పోలీస్‌ స్టేషన్లకు కూడా సమాచారాన్ని అందించారు. తద్వారా గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

ఈ క్రమంలోనే ఇద్దరు బాలికలను గృహనిర్బంధంలో చేసినట్లు గుర్తించారు పోలీసులు. వెంటనే ఆ ఇంటిపై దాడి చేశారు. తద్వారా బాలికలను కాపాడి వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే.. కొందరు యువకులు కూల్‌డ్రింక్‌లో మత్తుమందు కలిపి ఇచ్చారనీ.. ఆ తర్వాత స్పృహ కోల్పోయిన వారిని ఆ ఇంట్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారని పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

Next Story