అదుపుతప్పి లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు దుర్మరణం

అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది.

By Srikanth Gundamalla
Published on : 27 April 2024 6:45 PM IST

andhra pradesh, nakkapalli, road accident, three dead ,

 అదుపుతప్పి లారీని ఢీకొట్టిన కారు, ముగ్గురు దుర్మరణం 

అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం సాయంత్రం ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుంచి తుని వైపు వెళ్తున్న ఒక కారు అదుపుతప్పింది. వెదుళ్లపాలెం జంక్షన్ వద్దకు రాగానే కారు అదుప్పడంతో.. డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దాంతో.. ఆ కారు వేగంగా వచ్చి డివైడర్‌ను ఢీకొట్టింది. అతి వేగంగా ఉండటంతో.. కారు అంతటితో ఆగకుండా ఆవతలివైపు వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణం చేస్తున్న ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ఇక ఈ ప్రమాదం ఇతర వాహనదారులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు కూడా వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతి చెందిన ముగ్గురు మృతదేహాలను వెలికి తీశారు. ఇక కారులో తీవ్రగాయాలు అయిన డ్రైవర్‌ను కూడా బయటకు తీసి నక్కపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ కారు ప్రమాదంలో చనిపోయిన వారంతా విశాఖపట్నం నగరంలోని గోపాలపట్నంకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేశామనీ.. దర్యాప్తు జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పోలీసులు వెల్లడించారు.

Next Story