ఇంటి నుండి హాస్టల్‌కు వచ్చిన తొమ్మిదో తరగతి అమ్మాయి.. ఇంతలో
అల్లూరి జిల్లా అరకు లోయలో హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Feb 2024 9:30 AM ISTఇంటి నుండి హాస్టల్‌కు వచ్చిన తొమ్మిదో తరగతి అమ్మాయి.. ఇంతలో
అల్లూరి జిల్లా అరకు లోయలో హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న కిల్లో వసంత అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. డుబ్రిగూడ మండలం ఓంబి గ్రామానికి చెందిన వసంత ఇంటికి వెళ్లి తిరిగి హాస్టల్ కు వచ్చింది. తన తండ్రి ఓ హత్య కేసులో ఇటీవలె జైలు నుండి విడుదలై వచ్చాడు. ఈ క్రమంలో తండ్రిని చూసేందుకు వెళ్లి మళ్లీ తిరిగి హాస్టల్ కు వచ్చింది. అయితే ఇంటికి వెళ్లి వచ్చాక ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు రేపుతున్నాయి.
విషయం తెలిసిన వెంటనే సంఘటన అరకు పోలీసులు చేరుకున్నారు. తన తండ్రి ఒక హత్య కేసులో సెంట్రల్ జైలు నుంచి ఇంటికి వచ్చిన నేపథ్యంలో ఆయనను చూసేందుకు వసంత వెళ్లినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. హాస్టల్లోకి వచ్చిన అరగంటలోపే భోజనం చేయకుండా రూంలోకి వెళ్లి వసంత ఆత్మహత్య చేసుకున్నట్లుగా తోటి విద్యార్థినులు చెబుతున్నారు. ప్రిన్సిపాల్‌కు ఈ విషయాన్ని తెలియజేయగా స్కూల్ యాజమాన్యం పోలీసులకు తెలిపారు. బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.