Andhra Pradesh: వివాహితపై సామూహిక అత్యాచారం
ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి ఓ వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది.
By Srikanth Gundamalla Published on 18 Aug 2024 9:44 AM ISTAndhra Pradesh: వివాహితపై సామూహిక అత్యాచారం
ఏలూరులో దారుణం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి ఓ వివాహితపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ సంఘటన కలకలం రేపుతోంది. వివాహతి భర్తతో కలిసి మద్యం తాగిన యువకులు ఆపై భర్తను చితకబాది, భార్యపై అత్యాచారం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పెదవేగి మండలం విజయరాయికి చెందిన ఓ వ్యక్తి తన భార్యతో కలిసి 15 రోజుల క్రితమే నగరానికి వచ్చాడు. వన్‌టౌన్ రామకోటి ప్రాంతంలో ఉంటూ హోటల్‌లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అద్దె ఇల్లు కోసం ప్రయత్నిస్తూ.. రాత్రి వేళ రామకోటిలో సాంస్కృతిక కార్యక్రమాలు చేసే స్టేజిపై నిద్రిస్తున్నారు. చిన్న చిన్న పనులు చేస్తూ జులాయిగా తిరుగుతున్న ముగ్గురు యువకులు వీరికి పరిచయం అయ్యారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి వివాహిత భర్తతో వీరు మద్యం సేవించారు. ఆ తర్వాత అతనిపై ముగ్గురు యువకులు భర్తపై దాడి చేసి.. భార్యను అక్కడి నుంచి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెపైనా దాడికి తెగబడ్డారు.
ఇక నిస్సాహాయుడైన భర్త రోడ్డుపైకి వచ్చి కేకలు వేయడంతో కొందరు గుమిగూడారు. వారు వెళ్లే సరికి నిందితులు ముగ్గురు పారిపోయారు. బాధిత మహిళ భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. చివరకు ముగ్గరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులు చెంచు కాలనీకి చెందిన నూతపల్లి పవన్, లంబాడీపేటకు చెందిన నాగేంద్ర, మరడాని రంగారావు కాలనీకి చెందిన విజయ్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు. అయితే.. నిందితులను అరెస్ట్ చేసిన తర్వాత కోర్టు హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.