రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం
Andhra 3 bike-borne youth among 5 killed in two road accidents.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, అనకాపల్లి
By తోట వంశీ కుమార్ Published on 11 Feb 2023 3:35 AM GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు యువకులు సహా ఐదుగురు దుర్మరణం చెందారు.
వైజాగ్‌లోని వెంకోజిపాలెం సమీపంలో NH-16 స్ట్రెచ్‌లో పల్సర్ బైక్‌ను భారీ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెలుతున్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులను పి సాయి, ఐ దుర్గా ప్రసాద్, ఆర్ గోపిలుగా గుర్తించారు. వీరంతా 25 సంవత్సరాల లోపు వయస్సు గలవారే. సాయి, గోపి వైజాగ్‌లోని యెండాడ ప్రాంతానికి చెందిన వారని, దుర్గాప్రసాద్ శ్రీకాకుళం వాసి అని పోలీసులు తెలిపారు.
ముగ్గురూ యెండాడ నుంచి మద్దిలపాలెం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. బైక్ హ్యాండిల్ హెవీ వెహికిల్‌ను బ్రష్ చేయడం వల్ల స్కిడ్డింగ్‌కు దారితీసినట్లు అనుమానిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు కొన్ని ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. మృతులు వాడిన బైక్‌పై ఒక నినాదం ఉంది: ``మరణం ఊహించనిది కాబట్టి ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి".
ఇక రెండవ ఘటన అనకాపల్లి జిల్లా ఆస్క్‌పల్లి జంక్షన్ సమీపంలో జరిగింది. పత్తి లోడు వాహనం సిమెంట్ లోడు లారీని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను పశ్చిమ బెంగాల్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ఘటనలో డ్రైవర్, అతడి సహాయకుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కారణంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.