దంపతులను హత్యచేసిన వ్యక్తి.. నిందితుడిని కొట్టి చంపిన స్థానికులు
అనంతపరం జిల్లాలో దారణం సంఘటన జరిగింది. ఓ వ్యక్తి ఇంటి ముందు నిద్రపోతున్న దంపతులను కిరాతకంగా నరికి చంపాడు.
By Srikanth Gundamalla Published on 16 Sept 2023 12:30 PM ISTదంపతులను హత్యచేసిన వ్యక్తి.. నిందితుడిని కొట్టి చంపిన స్థానికులు
అనంతపరం జిల్లాలో దారణం సంఘటన జరిగింది. ఓ వ్యక్తి ఇంటి ముందు నిద్రపోతున్న దంపతులను కిరాతకంగా నరికి చంపాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న వారి కుమార్తెను కూడా చంపేందుకు ప్రయత్నించాడు. అయితే.. ఆమె అరవడంతో స్థానికులు అప్రమత్తం అయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు. నిందితుడు పారిపోతున్న క్రమంలో రాళ్లతో కొట్టారు. దాంతో.. అతడు కూడా ప్రాణాలు కోల్పోయాడు.
అనంతపురం జిల్లా యాడికి మండలం నిట్టూరులో సొమక్క (47), బాలరాజు (57) దంపతులు నివసిస్తున్నారు. సెప్టెంబర్ 15న రాత్రి తమ ఇంటి ముందే పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో ఎవరూ లేని వేళ ప్రసాద్ (35) అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు. తనతో పాటు తెచ్చుకున్న కొడవలిని తీసి దంపతులు ఇద్దరిపై తీవ్రంగా దాడి చేశాడు. దాంతో.. తీవ్ర గాయాలైన దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే.. పక్కనే బాలరాజు కూతురు కూడా ఉంది. ఆమెను కూడా చంపేందకు ప్రసాద్ ప్రయత్నించాడు. కొడవలి తీసుకుని ఆమెపై దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఆమె గట్టిగా అరవడంతో స్థానికులు అప్రమత్తం అయ్యి బయటకు వచ్చి చూశారు.
ఇద్దరిని చంపి.. వారి కుమార్తెను కూడా చంపేయబోతుండటాన్ని చూసి వెళ్లి అడ్డుకున్నారు. ఆ తర్వాత నిందితుడిని స్థానికులంతా చుట్టుముట్టారు. అయితే.. జనాలను ఒకేసారి చూసి భయపడిపోయిన నిందితుడు ప్రసాద్ పారిపోయే ప్రయత్నం చేశాడు. దాంతో.. స్థానికులు అతడిపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో నిందితుడు ప్రసాద్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. నిందితుడు ప్రసాద్ చనిపోయినవారికి సమీప బంధువని తెలుస్తోంది. మతిస్థిమితం లేని వ్యక్తి అని పలువురు చెబుతున్నారు. ఈ ఘటన గురించి వివరాలు తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు.మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. గ్రామంలో ఒకేసారి ముగ్గురు చనిపోవటంతో విషాదఛాయలు అలుముకున్నాయి.