రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇవాళ ఉదయం స్కూల్ పిల్లలతో వెళ్తున్న బస్సును వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సుల బలంగా ఢీకొట్టింది. జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 15 మంది చిన్నారులను గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, కొందరు యువకులు గాయపడిని విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 20 మంది విద్యార్థులు ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో స్కూల్ బస్సులోని పిల్లలు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం సంఘటనా స్థలానికి పరుగులు తీశారు.
ఈ ఘటనపై స్పందించిన కలెక్టర్.. ప్రమాదానికి గల కారణాలను డీఈవోను అడిగి తెలుసుకున్నారు. గాయాలపాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ ప్రమాద ఘటనపై జిల్లా మంత్రి కేటీఆర్ స్పందించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్ అనురాగ్ , బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో ఫోన్లో మాట్లాడారు. విద్యార్థుల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదేశించారు. అవసరమైతే హైదరాబాద్‌కు తరలించాలని సూచించారు.