అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో దారుణం.. 9 ఏళ్ల బాలికపై వృద్ధుడి అఘాయిత్యం

An old man was arrested for molesting a 9-year-old girl in a lift in Ahmedabad. అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ఓ 62 ఏళ్ల వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అభం శుభం తెలియని 9 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

By అంజి
Published on : 9 Sept 2022 11:46 AM IST

అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో దారుణం.. 9 ఏళ్ల బాలికపై వృద్ధుడి అఘాయిత్యం

అపార్ట్‌మెంట్‌ లిఫ్ట్‌లో ఓ 62 ఏళ్ల వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. అభం శుభం తెలియని 9 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మంగళవారం నాడు జరిగింది. ఈ ఘటన లిఫ్ట్‌లోని సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. 4వ తరగతి చదువుతున్న 9 ఏళ్ల చిన్నారి మధ్యాహ్నం 12.30 గంటలకు పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె అపార్ట్‌మెంట్‌లోని 11వ అంతస్తులో ఉన్న తన ఇంటికి వెళ్లడానికి లిఫ్ట్‌ ఎక్కింది. అదే సమయంలో జగత్‌పూర్‌కు చెందిన నిందితుడు భానుప్రతాప్‌ రాణా లిఫ్ట్‌లోనే ఉన్నాడు.

ఇంటికి చేరుకున్న తర్వాత, లిఫ్ట్ లోపల నిందితుడు తనను వేధించాడని చిన్నారి తన తల్లిదండ్రులకు చెప్పింది. తల్లిదండ్రులు లిఫ్ట్‌లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా నిందితుడు తమ బిడ్డను వేధించినట్లు గుర్తించారు. దీని ఆధారంగా వారు చంద్‌ఖేడా పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసి, నేరానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని అందజేశారు. పోలీసులు రాణాను అతని ఇంటి నుంచి అరెస్టు చేశారు. అతనిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 354 మరియు లైంగిక నేరాలకు వ్యతిరేకంగా పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సెక్షన్ల కింద వేధింపుల అభియోగాలు మోపారు.

Next Story