మర్మాంగం కోసుకుని ఎంబీబీఎస్ స్టూడెంట్ ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో వేరు వేరు చోట్ల రెండు విషాద ఘటనలు జరిగాయి. ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు.
By అంజి Published on 10 July 2023 6:48 AM ISTమర్మాంగం కోసుకుని ఎంబీబీఎస్ స్టూడెంట్ ఆత్మహత్య
హైదరాబాద్ నగరంలో వేరు వేరు చోట్ల రెండు విషాద ఘటనలు జరిగాయి. ఎంబీబీఎస్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. జగద్గిరిగుట్ట పరిధిలోని పాపిరెడ్డి నగర్ ఉంటున్న దీక్షిత్ రెడ్డి (21).. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ దీక్షిత్ రెడ్డి తన పురుషాంగాన్ని కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే దీక్షిత్ ఆత్హహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా దేవర్పుల గ్రామానికి చెందిన దీక్షిత్ రెడ్డి కుటుంబం.. 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ శివారు పాపిరెడ్డినగర్‌కు వచ్చి నివాసం ఉంటున్నారు. గతంలో దీక్షిత్ రెడ్డి నిద్రమాత్రలు మింగి ప్రాణాలతో బయటపడ్డాడని పోలీసులు తెలిపారు. మానసిక స్థితి మెరుగుపడేందుకు తల్లిదండ్రులు చికిత్స చేయిస్తున్నారు. అయితే ఏమైందో ఏమో ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో దీక్షిత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇదిలా ఉండగా నగరంలో మరోచోట విషాదకరమైన సంఘటన జరిగింది. మాదాపుర్‌లోని అవాస హోటల్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన హేమంత్ కొంత కాలంగా హోటల్ వర్క్ చేస్తున్నారు. అవాస హోటల్ టెర్రస్ పైన గల ఇనుప రాడ్డుకు ఉరివేసుకుని హేమంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. హోటల్‌లో టేక్నిషియన్‌గా పనిచేస్తున్న హేమంత్.. ఆర్థిక సమస్యల కారణంగా సతమతమై తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.