ఆ చదువు నాకు అర్థం కాదు, మీరేమో అర్థం చేసుకోరు..నోట్ రాసి విద్యార్థిని సూసైడ్
హన్మకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
By Knakam Karthik
ఆ చదువు నాకు అర్థం కాదు, మీరేమో అర్థం చేసుకోరు..నోట్ రాసి విద్యార్థిని సూసైడ్
హన్మకొండ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నయీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని శివాని హాస్టల్ రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇంటర్‌లో తీసుకున్న గ్రూప్ వల్ల చదువు అర్థం కావడంలేదని నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.
"మమ్మీ.. చెల్లిని బాగా చదివించండి, మంచి కాలేజిలో మంచి గ్రుప్ తీసుకోమను.. నా లాగా అర్ధం కాని చదువు వద్దు దాన్ని మంచిగా చదివించి మీరు మంచిగ ఉండండి. కాలేజీలో జాయిన్ చేసేముందు ఎవరినైనా కొంచం అడిగి జాయిన్ చేయండి. చెల్లి నువ్వు కూడా మంచిగ చదువుకోవే. ఆ చదువు నాకు అర్దం అయితలే మీకు చెప్తే మీరు అర్ధం చేస్కుంటలే. నాకు మొత్తం టెన్షన్ అయితాంది. మైండ్ పోతాంది. మీరు చేప్పిన చదువు నాతోని ఐతాలే. నేను చదువుదాం అనుకున్న చదువుకి మీరు ఒప్పుకుంటలే చివరికి నాకు చావే దిక్కు అయింది... ఏం అర్ధం కాక మధ్యలో నలిగి పోతున్న. ఈ సంవత్సం అంటే ఏదో మీరు ఫీజు కట్టారు. అని ఏదోలా కింద మీద పడి ఉన్న.. ఇగ నాతోని కాదు నేను వెళ్ళి పోతున్న .... నాకు ఇంత తక్కు మార్కులు రావడం నేను, మీరు తట్టుకోలేరు అందుకే చనిపోతున్న అందరూ జాగ్రత్త... మంచిగ ఉండండి.... ఈ ఒక్క సంవత్స రం కూడా మీ కోసమే చదివిన అయిన నా తోని అయితలే ఎంత కష్టపడ్డ రావడం లేదు. అందరు జాగ్రత్త ...అని విద్యార్థిని సూసైడ్ నోట్‌లో రాసింది.