విడాకులు ఇవ్వాల‌ని.. గ‌ర్భిణీ భార్య‌కు హెచ్ఐవీ ఇంజెక్ష‌న్ ఇచ్చిన భ‌ర్త‌

Aligarh accused of giving HIV injection to wife.వివాహం జ‌రిగిన సంవ‌త్స‌రం కూడా కాలేదు. భ‌ర్త‌కు మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  14 Sep 2021 8:34 AM GMT
విడాకులు ఇవ్వాల‌ని.. గ‌ర్భిణీ భార్య‌కు హెచ్ఐవీ ఇంజెక్ష‌న్ ఇచ్చిన భ‌ర్త‌

వివాహం జ‌రిగి సంవ‌త్స‌రం కూడా కాలేదు. భ‌ర్త‌కు మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం ఉంద‌ని భార్య‌కు తెలిసింది. ఇదేం ప‌ని నిల‌దీయ‌డంతో.. అప్ప‌టి నుంచి స‌ద‌రు భ‌ర్త‌.. విడాకులు ఇవ్వాల‌ని బెదిరిస్తున్నాడు. అంతేకాదు నీచానికి ఒడిగ‌ట్టాడు. హెచ్ఐవీ రోగికి ఉప‌యోగించిన సూదీతో గ‌ర్బిణీ అయిన త‌న భార్య‌కు ఇంజెక్ష‌న్ ఇచ్చాడు. ఈ దారుణఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అలీగ‌డ్‌లో జ‌రిగింది.

పోలీసులు తెలిపిన వివ‌రాల మేర‌కు.. మ‌హేశ్ గౌత‌మ్ అనే వ్య‌క్తి అలీగఢ్ లోని ఓ ఆస్ప‌త్రిలో ల్యాబ్ టెక్నీషీయన్ గా కాంట్రాక్టు విధానంలో ప‌నిచేస్తున్నాడు. గ‌తేడాది డిసెంబ‌ర్‌లో అత‌డికి ఓ యువ‌తితో వివాహం జ‌రిగింది. కొద్ది రోజుల అనంత‌రం మ‌హేశ్‌కు అదే ఆస్ప‌త్రిలో ప‌నిచేస్తున్న స‌హోద్యోగినితో వివాహేత‌రం సంబంధం ఉన్న‌ట్లు భార్య‌కు తెలిసింది. ఈ విష‌య‌మై ఆమె భ‌ర్త‌ను నిల‌దీసింది. ఇక అంతే.. అప్ప‌టి నుంచి భార్య‌ను వేదించ‌డం మొద‌లుపెట్టాడు. త‌న‌కు విడాకులు ఇవ్వాల‌ని ఒత్తిడి చేసేవాడు. ప్ర‌స్తుతం అత‌డి భార్య గ‌ర్భ‌వ‌తి. గర్భిణి అని కూడా చూడకుండా.. హెచ్ఐవీ ఉన్న వ్య‌క్తికి చేసిన ఇంజెక్ష‌న్‌(సూది)తో మ‌హేష్ త‌న భార్య‌కు ఇంజెక్ష‌న్ చేశాడు.

ఈ విష‌యం బాధిత మ‌హిళ తండ్రికి తెలియ‌డంతో అత‌డు పోలీసుల‌ను ఆశ్రయించాడు. గ‌ర్భ‌వ‌తి అని తెలిసిన‌ప్ప‌టి నుంచి త‌న‌కు హెచ్ఐవీ అంటించేందుకు య‌త్నిస్తున్నాడ‌ని బాధితురాలు ఆరోపించింది. మ‌హేష్‌తో పాటు అత‌డి తల్లిదండ్రులు, ఆస్ప‌త్రి యాజ‌మాన్యంపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

Next Story
Share it