మహారాష్ట్రలోని థానే జిల్లాలో దారుణం జరిగింది. తన ఇంట్లో 23 ఏళ్ల ఎయిర్‌హోస్టెస్‌పై ఆమె సహోద్యోగి అత్యాచారం చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ఆదివారం నాడు తెలిపారు. జూన్ 29న జరిగిన దాడికి సంబంధించి మీరా రోడ్ ప్రాంత నివాసి అయిన నిందితుడిని శుక్రవారం పోలీసులు అరెస్టు చేసినట్లు ఒక అధికారి తెలిపారు.
25 ఏళ్ల నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్) సెక్షన్లు 64 (అత్యాచారం), 351(2) (నేరపూరిత బెదిరింపు), 352 (శాంతికి భంగం కలిగించే ఉద్దేశ్యంతో ఉద్దేశపూర్వకంగా అవమానించడం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు నవ్‌ఘర్ పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ ధీరజ్ కోలి తెలిపారు.
ఆ మహిళ, ఆమె సహోద్యోగి, తోటి సిబ్బంది, జూన్ 29న లండన్‌కు డ్యూటీలో భాగంగా వెళ్లి వచ్చిన తర్వాత నగరానికి తిరిగి వచ్చారని ఆయన చెప్పారు. "ముంబైకి తిరిగి వచ్చిన తర్వాత, నిందితుడు బాధితురాలిని తన ఇంటికి తీసుకెళ్లి, అక్కడ ఆమెపై లైంగిక దాడి చేసి అత్యాచారం చేశాడు" అని అధికారి తెలిపారు. స్థానిక పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారని ఆయన అన్నారు.