జమ్మూ కాశ్మీర్‌లోని వైమానిక దళ స్టేషన్‌లోని వింగ్ కమాండర్ అత్యాచారం, మానసిక వేధింపులు, నిరంతర వేధింపులకు పాల్పడినట్లు మహిళా ఫ్లయింగ్ ఆఫీసర్ ఆరోపించడంతో భారత వైమానిక దళం అంతర్గత విచారణకు ఆదేశించినట్లు వర్గాలు ఓ నేషనల్ మీడియాకి తెలిపాయి. వింగ్ కమాండర్‌పై మహిళా అధికారి ఫిర్యాదు మేరకు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
వింగ్ కమాండర్‌పై భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 376(2) కింద బుద్గామ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయబడింది. ఇది అధికార హోదాలో ఉన్న వ్యక్తులు చేసిన తీవ్రమైన అత్యాచారానికి సంబంధించినది. ఫిర్యాదుదారు ప్రకారం, డిసెంబరు 31, 2023 రాత్రి, ఆఫీసర్స్ మెస్‌లో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో అధికారి తన గదిలో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపించిన తర్వాత ఈ సంఘటన జరిగింది.
2021లో జరిగిన ఇలాంటి సంఘటనలో, ఐఏఎఫ్ మహిళా పైలట్ తన ఫ్లైట్ కమాండర్ తనను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ జమ్మూ కాశ్మీర్ హైకోర్టును ఆశ్రయించింది.