మహిళా క్లయింట్‌పై అత్యాచారం.. న్యాయవాది అరెస్ట్

Agra advocate arrested on rape charges after woman threatens suicide. ఆగ్రాలోని ఒక సీనియర్ న్యాయవాదిని న్యూ ఆగ్రా పోలీసులు శనివారం నాడు ఒక మహిళపై

By అంజి  Published on  5 Feb 2023 4:23 AM GMT
మహిళా క్లయింట్‌పై అత్యాచారం.. న్యాయవాది అరెస్ట్

ఆగ్రాలోని ఒక సీనియర్ న్యాయవాదిని న్యూ ఆగ్రా పోలీసులు శనివారం నాడు ఒక మహిళపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ అరెస్టు చేశారు. న్యాయవాదిపై చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్యాయత్నానికి పాల్పడుతానని బాధితురాలు బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. న్యాయవాది తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, అసభ్యకర వీడియోలు తీశాడని, తన నుంచి రూ.40 లక్షలు వసూలు చేశాడని బాధితురాలు ఆరోపించింది. తాను చాలాసార్లు పోలీసులను ఆశ్రయించినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తనకు ఎదురైన బాధను చెప్పుకునేందుకు పోలీస్ కమిషనరేట్‌కు వెళ్లానని ఆమె పేర్కొంది.

న్యాయవాది కొన్ని నెలల క్రితం పట్టణంలో చర్చనీయాంశంగా మారారు. అతని ఫోన్ దొంగిలించబడింది. ఫోన్‌లో రికార్డ్ చేసిన పలువురు మహిళలతో అతను సన్నిహిత క్షణాల వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శుక్రవారం తనను న్యాయవాది లైంగికంగా దోపిడీ చేశారని ఆగ్రా కమిషనర్ ప్రీతీందర్ సింగ్‌ను ఆశ్రయించిన మహిళల్లో ఒకరు, జనవరి 4న న్యాయవాది తనను తన ఇంటికి పిలిపించి, తన అసభ్యకరమైన వీడియోలను వైరల్ చేయడం ద్వారా పరువు తీస్తానని బెదిరించి అత్యాచారం చేశాడని చెప్పారు. ''నాకు తన భర్తతో విభేదాలు వచ్చాయి, ఆ తర్వాత నిందితుడు కోర్టులో నా తరపున వాదించడంతో నాకు పరిచయం ఏర్పడింది'' బాధితురాలు తెలిపింది.

Next Story