ఓ పక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతుండగా.. మరో పక్క తెలంగాణలో మాత్రం దారుణమైన ఘటన వెలుగు చూసింది. మెదక్ జిల్లాలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ వివాహితపై యాసిడ్ పోసి పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. అల్లాదుర్గం మండలం మల్కాపూర్ తాండాకు చెందిన 40 ఏళ్ల వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారుజామున గడిపెద్దాపూర్ దగ్గర యాసిడ్ దాడి చేశారు.
దాడిలో తీవ్రంగా గాయపడ్డ బాధితురాలి పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నర అల్లాదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, వివాహేతర సంబంధమే ఈ దాడికి కారణం అయ్యుండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.