కొత్త సంవత్సరం వేళ ఉప్ప‌ల్‌లో లారీ భీభ‌త్సం

Accident in Uppal. నూత‌న సంవ‌త్స‌రం వేళ ఉప్ప‌ల్‌లో లారీ భీభ‌త్సం సృష్టించింది. ఈ ఘ‌ట‌న‌లో బైక్ పై ప్ర‌యాణిస్తున్న వ్య‌క్తి అక్క‌డిక్క‌డే మృతి చెందాడు

By Medi Samrat  Published on  1 Jan 2021 10:46 AM IST
lorry accident in uppal

నూత‌న సంవ‌త్స‌రం వేళ ఉప్ప‌ల్‌లో లారీ భీభ‌త్సం సృష్టించింది. ఎన్టీఆర్ఐ వ‌ద్ద అతి వేగంతో వ‌చ్చిన లారీ వెనుక నుంచి డీసీఎం వ్యాన్‌ను ఢీకొట్టింది. లారీ ఢి కొట్ట‌డంతో డీసీఎం ముందున్న బైక్ ను ఢీకొట్టి హ‌నుమాన్ ఆల‌యం ప్ర‌హారీ గోడ‌ను ఢీకొట్టి ఆగింది. డీసీఎం ను ఢీకొట్టిన లారీ ఆగ‌కుండా మ‌రో మినీ లారీ ఢికొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో బైక్ పై ప్ర‌యాణిస్తున్న వ్య‌క్తి అక్క‌డిక్క‌డే మృతి చెందాడు. మినీ లారీలో ప్ర‌యాణిస్తున్న న‌లుగురికి తీవ్ర గాయాల‌య్యాయి.

క్ష‌త‌గాత్రుల‌ను వెంట‌నే ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్ర‌మాదంలో ఉప్ప‌ల్‌-సికింద్రాబాద్ ప్ర‌ధాన ర‌హ‌దారిపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. స‌మాచారం అందుకున్న పోలీసులు అక్క‌డ‌కు చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. లారీ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యం కార‌ణంగానే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. మృతుడిని బంజార‌హిల్స్‌కు చెందిన రాంచంద‌ర్‌(24)గా గుర్తించారు. కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ట్రాఫిక్‌ను క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తున్నారు.


Next Story