ఘోర రోడ్డు ప్ర‌‌మాదం.. ముగ్గురు మృతి

Accident In Guntur District.గుంటూరు:రెండు లారీలు ఒకదాని వెనుక ఒకటి ఢీ కొన‌డంతో ప్ర‌మాదం జ‌రిగింది.

By Medi Samrat  Published on  16 April 2021 8:46 AM IST
accident in Guntur

గుంటూరు : జిల్లా కేంద్రంలోని దాచేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఒకదాని వెనుక ఒకటి ఢీ కొన‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. గామాలపాడు గ్రామ శివారులో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.

క్షతగాత్రులను స్థానికులు 108 సిబ్బంది సాయంతో జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతులను గామాలపాడుకు చెందిన వెంకటరామయ్య, జానీ బాషాగా పోలీసులు గుర్తించారు.




Next Story