ఎంజీబీఎస్‌ వద్ద ప్రమాదం.. ఇద్దరు యువ‌కులు మృతి

Accident At Hyderabad MGBS Bus Stand. ఈ రోజు ఉద‌యం ఎంజీబీఎస్ బస్సు స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది, ఇద్దరు యువకులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు.

By Medi Samrat  Published on  15 Feb 2021 9:07 AM IST
Accident At Hyderabad MGBS Bus Stand

న‌గ‌రంలో విషాదం చోటుచేసుకుంది. ఈ రోజు ఉద‌యం ఎంజీబీఎస్ బస్సు స్టేషన్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభ‌వించింది. ఈ ప్ర‌మాదంలో ఇద్దరు యువకులు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. ఓ ఫంక్షన్ నుంచి ఇంటికి తిరిగి వెళుతున్న సమయంలో రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి ఒక్కసారిగా మోటర్ సైకిల్ అదుపు తప్పి లారీ కిందకు దూసుకు వెళ్లడంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. దీంతో మోటర్ సైకిల్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్క‌డికక్క‌డే మృతి చెందారు.

స‌మాచారం అంద‌డంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మృతులు చాదర్ ఘాట్‌కు చెందిన మోషిన్ ఖాన్, ఫసీ ఖాన్ గా గుర్తించారు. ఘ‌ట‌న‌పై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది.


Next Story