రోడ్డుప్రమాదంలో కుమార్తె సహా దంపతుల మృతి

Accident At Gadwal District. గద్వాల జిల్లా ధర్మవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులతో పాటు కుమార్తె దుర్మరణం పాలయ్యారు.

By Medi Samrat
Published on : 12 April 2021 11:48 AM IST

accident in gadwal

జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులతో పాటు కుమార్తె దుర్మరణం పాలయ్యారు. జాతీయ రహదారిపై లారీని తప్పించబోయిన ఓ కారు.. అవతలి వైపు రోడ్డుపై వస్తున్న బొలేరో వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని దంపతులు మురళీ మోహన్‌ రెడ్డి (45), సుజాత (40)తో పాటు వారి కుమార్తె నేహా రెడ్డి (13), కుమారుడు సూర్యతేజకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మోహన్‌రెడ్డి, సుజాత.. ఆస్పత్రిలో నేహా రెడ్డి మృతి చెందారు. సూర్యతేజ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోదండపురం ఎస్సై కృష్ణయ్య ఘటనాస్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


Next Story