హైదరాబాద్‌లో దారుణం.. బీరు బాటిల్‌ కోసం యువకుడి హత్య

హైదరాబాద్ నగరంలో నడిరోడ్డుపై హత్యలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. నడిరోడ్డుపై హత్యలతో జనం బెంబేలెత్తిపోతున్నారు.

By అంజి  Published on  18 July 2023 11:22 AM IST
brawl beer bottles, meerpet, jillelguda, Crime news

హైదరాబాద్‌లో దారుణం.. బీరు బాటిల్‌ కోసం యువకుడి హత్య

హైదరాబాద్ నగరంలో నడిరోడ్డుపై హత్యలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. నడిరోడ్డుపై హత్యలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. కేవలం బీర్ బాటిల్ కోసం ఓ నలుగురు వ్యక్తులు కలిసి ఓ యువకుడ్ని హత్య చేసిన సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. ఇంతటి దారుణమైన సంఘటన మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నడిరోడ్డుపై హత్యలు జరుగుతూ ఉంటే స్థానికులు, వాహనదారులు చూస్తూ ఉండిపోతున్నారే తప్ప దానిని ఆపే ప్రయత్నం మాత్రం చేయడం లేదు. మరికొందరైతే తమ సెల్ ఫోన్‌లో ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. జనం మానవత్వాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు.

సాయి వరప్రసాద్ అనే యువకుడు బీరు బాటిల్ తీసుకుని జిల్లెల్ల గూడా నుండి వెళ్తున్న సమయంలో నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్, సంతోష్ యాదవ్, పవన్ అనే నలుగురు వ్యక్తులు అతడి బండిని అడ్డగించారు. సాయి వరప్రసాద్‌ను బీర్ బాటిల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ సాయి వరప్రసాద్ అందుకు నిరాకరించాడు. బీర్ బాటిల్ ఇవ్వకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వివాదం చెలరేగింది. దీంతో ఆగ్రహానికి లోనైనా నలుగురు సాయి వరప్రసాద్‌పై దాడి చేశారు. అందులో ఓ వ్యక్తి తన వద్ద ఉన్న కత్తితో సాయి వరప్రసాద్ పై దాడి చేశాడు. ఈ దాడిలో సాయి వరప్రసాద్ కి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయాడు.

సాయి వరప్రసాద్ పై నలుగురు వ్యక్తులు దాడి చేసి కత్తితో పొడిచి హత్య చేస్తుండగా జనం చూస్తూ ఉండిపోయారే తప్ప వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించలేదు. విషయం తెలుసుకున్న వెంటనే స్నేహితుల ఘటన స్థలానికి చేరుకొని రక్తం మడుగులో పడి ఉన్న సాయి వరప్రసాద్‌ను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయి వరప్రసాద్ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పల్లె నితీష్ గౌడ్, కిరణ్ గౌడ్, సంతోష్ యాదవ్, పవన్‌పై పోలీసులు కేసు నమోదు చేసుకుని పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నలుగురు వ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story